చనిపోయిన కరోనా రోగి.. బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు చెప్పి..

ABN , First Publish Date - 2020-08-08T17:04:44+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శుక్రవారం మరో 852 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 17,946కి చేరింది. వీరిలో వైరస్‌ నుంచి కోలుకుని 9,771 మంది డిశ్చార్జి కాగా, మరో 8,054 మంది వివిధ ఆస్పత్రులు,

చనిపోయిన కరోనా రోగి.. బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు చెప్పి..

వైరస్‌ విజృంభణ.. విశాఖలో మరో 852 మందికి కరోనా పాజిటివ్‌

జిల్లాలో 17,946కి చేరిన కేసుల సంఖ్య

కోలుకుని 9,771 మంది డిశ్చార్జి

చికిత్స పొందుతూ మరో ఐదుగురి మృతి

జిల్లాలో 121కి చేరిన కొవిడ్‌ మరణాలు


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శుక్రవారం మరో 852 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 17,946కి చేరింది. వీరిలో వైరస్‌ నుంచి కోలుకుని 9,771 మంది డిశ్చార్జి కాగా, మరో 8,054 మంది వివిధ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కాగా వైరస్‌బారిన పడి చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 121కి చేరింది. శుక్రవారం అత్యధికంగా పారిశ్రామిక ప్రాంతంలో 67 మంది, పెందుర్తి పీహెచ్‌సీ పరిధిలో 49, అనకాపల్లిలో 39, మన్యంలో 35 మంది వైరస్‌బారిన పడ్డారు.


పారిశ్రామిక ప్రాంతంలో 67 కేసులు

పారిశ్రామిక ప్రాంతంలో 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 45వ వార్డులో ఒకరు, 46వ వార్డులో 16 మంది, 47వ వార్డులో 32 మంది, 49వ వార్డులో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే, మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో మరో ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. 


పెందుర్తి పీహెచ్‌సీ పరిధిలో 49.. 

పెందుర్తి సచివాలయం సమీపంలోని భవనంలో 157 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 49 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


అనకాపల్లిలో 39 కేసులు 

అనకాపల్లి పట్టణంలోని రావుగోపాలరావు స్టేడియంలో శుక్రవారం 137 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 39 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో అనకాపల్లిలో మొత్తం కేసులు 720కి పెరిగాయి. గవరపాలెంలో పది మంది పురుషులు(25, 35, 35, 40, 52, 59, 65, 67, 72, 79), ఇద్దరు మహిళలు(22, 49), విజయరామరాజుపేటలో ఇద్దరు యువకులు(21, 28), మిరియాల కాలనీలో ఇద్దరు మహిళలు(17, 24), ఇద్దరు పురుషులు(27, 32), పూడిమడక రోడ్డులో వ్యక్తి(30), చినరాజుపేటలో వ్యక్తి(49), చిన్నవీధిలో వ్యక్తి(39), పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ముగురు కానిస్టేబుళ్లు (35, 37, 38), నాయుళ్ల వీధిలో వృద్ధురాలు(63), జిల్లా కోర్టులో ఉద్యోగి(28), అంజయ్య కాలనీలో మహిళ(47), వ్యక్తి (52) గాంధీనగరంలో మహిళ(54), వృద్ధుడు(61), దొడ్డివారి వీధిలో వృద్ధురాలు(64), నర్సింగరావుపేటలో వ్యక్తి(37), మహిళ (36), శారదా కాలనీ ఇద్దరు వ్యక్తులు(31, 37), మళ్ల వీధిలో వృద్ధురాలు(61), వృద్ధుడు (70), మల్లిమణుగులవారి వీధిలో వృద్ధురాలు(69), పిసినికాడలో వ్యక్తి (33) కరోనా బారిన పడ్డారు. 


మన్యంలో 35 మంది..

పాడేరు మన్యంలో శుక్రవారం 35 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ లీలాప్రసాద్‌ తెలిపారు. ఏజెన్సీ వ్యాప్తంగా 130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 35 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఇప్పటివరకు ఏజెన్సీలో 276 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 


గోపాలపట్నంలో 18.. 

గోపాలపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. స్థానిక లక్ష్మీనగర్‌లో ఎనిమిది మంది, రామకృష్ణానగర్‌లో ఒకరు, ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఒకరు, అజంతాపార్క్‌లో ముగ్గురు, టైలర్స్‌ కాలనీలో ఇద్దరు, ప్రశాంతి నగర్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.


ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రి పరిధిలో 18.. 

ఆరిలోవ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 182 మందికి ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా, 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


సింహాచలంలో 15.. 

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 95 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


అచ్యుతాపురంలో 14..

అచ్యుతాపురం మండలంలో 14 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. చోడపల్లి పంచాయతీ మోసయ్యపేటలో వ్యక్తి(40), మహిళ(27), జంగులూరు జంక్షన్‌లో ఇద్దరు కార్మికులు(34, 50), హరిపాలెం పీహెచ్‌సీ పరిధిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు వైరస్‌బారిన పడినట్టు వైద్యులు ఆడారి కనకమహాలక్ష్మి, రజని తెలిపారు.  వైరస్‌ సోకిందన్నారు.


మాధవధార, మురళీనగర్‌లో 12.. 

మురళీనగర్‌, మాధవధార ప్రాంతాల్లో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మురళీనగర్‌ పరిధిలో ఒకరు, ఏఎస్‌ఆర్‌ నగర్‌లో ముగ్గురు, మాధవధారలో ముగ్గురు, మహత్‌కాలనీ పరిధి రాజీవ్‌కాలనీ, సీతన్నగార్డెన్స్‌ ప్రాంతాల్లో ఐదుగురికి వైరస్‌ సోకింది. 


ఆనందపురంలో పది..

ఆనందపురం మండలంలో పది కరోనా కేసులు నమోదైనట్టు ఎంపీడీవో లవరాజు తెలిపారు. దుక్కవానిపాలెంలో ఐదుగురు, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, ఎల్‌వీపాలెం, మచ్చవానిపాలెంలో ఒక్కొక్కరు వైరస్‌బారిన పడ్డారు.


భీమిలిలో ఏడుగురికి.. 

భీమిలిలో కరోనా వైద్య పరీక్షలలో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎగువపేటలో ఇద్దరు, బోయివీధిలో ఇద్దరు, తోటవీధిలో ఇద్దరు, కృష్ణాకాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

కశింకోట మండలంలో ఐదు....

కశింకోట మండలంలో ఐదు కరోనా కేసులు నమోదయాయయి. బంగారయ్యపేటలో ఏఎన్‌ఎం, ఆమె భర్త, కొడుకు, కూతురు(38, 40, 10, 7), ఆనందపురంలో వ్యక్తి(45), కన్నూరుపాలెంలో గర్భిణి(24), రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగి (45) వైరస్‌ బారిన పడ్డారు.


పరవాడ మండలంలో ఐదుగురికి...

పరవాడ మండలంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. పరవాడ బొంకులదిబ్బ వీధికి చెందిన వ్యక్తి(35), పరదేశిమాంబ గుడి వీధి వ్యక్తి(53), దేశపాత్రునిపాలెం శివారు శేషాద్రి నగర్‌కు చెందిన బాలికలు(10), (14), పి.భోనంగికి చెందిన యువకుడు(23) వైరస్‌ బారినపడ్డారు.


తాటిచెట్లపాలెం పరిధిలో ఐదు.. 

తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. 


వేపగుంట ప్రాంతంలో నలుగురికి....

వేపగుంట ప్రాంతంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించారు. సేనాతివానిపాలెంలో మహిళ, సింహపురికాలనీలో వ్యక్తి, శ్రీనివాసనగర్‌లో మరో వ్యక్తి, 69వ వార్డులో పారిశుధ్య కార్మికురాలు వైరస్‌ బారినపడ్డారు.


మునగపాక మండలం నాగులాపల్లిలో తండ్రి, కొడుకు (46, 23), కొత్తనాగవరంలో వ్యక్తి(45)కి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. 


కె.కోటపాడు మండలంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కె.కోటపాడులో ఇద్దరు వ్యక్తులు(50 ఏళ్లు, 40 ఏళ్లు), చౌడువాడలో ఒకరు(35) వైరస్‌బారిన పడ్డారు.


పెందుర్తి శివారు చీమలాపల్లి కాలనీలో ఒకరికి, లక్ష్మీపురం గవరపాలెం కాలనీలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించారు.


సబ్బవరం మండలం గొటివాడలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


జి.మాడుగులలో ఇద్దరికి(భార్యాభర్తలు) కరోనా నిర్ధారణ కావడంతో పాడేరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. 


నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు(23, 36) కరోనా బారిన పడ్డారు.


చోడవరం గోవిందమ్మ కాలనీలో ఉంటున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ (42)కు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం ఇతనికి  పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.


గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న వృద్ధురాలి(69)కి వైరస్‌ సోకింది. పెదబొడ్డేపల్లి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు.


బుచ్చెయ్యపేట మండలం తురకలపూడి పీహెచ్‌సీ వైద్యాధికారిణి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఈమె కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా ఆమెకు కూడా పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది.


ఎలమంచిలి మునిసిపాలిటీ యర్రవరం వార్డులో వ్యక్తి(29), ధర్మవరం వార్డులో వృద్ధుడు(65) కరోనా వైరస్‌బారిన పడ్డారు.


పాయకరావుపేట పట్టణంలో ఇద్దరు వ్యక్తులు(32, 40)లకుపాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు డాక్టర్‌ శిరీష తెలిపారు. 


చింతపల్లి రామాలయం వీధిలో ఒక కరోనా పాజిటివ్‌ నమోదైనట్టు ఆర్‌వీనగర్‌ వైద్యాధికారి గాయత్రి తెలిపారు.  


రేషన్‌ డీలర్‌ మృతి.. ఆలస్యంగా వెలుగులోకి.. 

అచ్యుతాపురం:పూడిమడకకు చెందిన ఒక రేషన్‌ డీలర్‌(72) కరోనాతో మృతి చెందారు. మృతుడి అన్న కుమారుడి కథనం ప్రకారం... ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి గత నెల 26న పాజిటివ్‌ వచ్చింది. వీరంతా విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రేషన్‌ డీలర్‌ విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియకపోవడంతో తమ్ముడు, అన్న కుమారుడు గురువారం ఉదయం విమ్స్‌కి వెళ్లి వాకబు చేశారు. కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్పారు. కానీ ఆయన అప్పటికే చనిపోయారు. ఈ విషయాన్ని చెప్పలేదు. గురువారం ఉదయం ఆరున్నర గంటలకు చనిపోయారని విమ్స్‌ శుక్రవారం సిబ్బంది సమాచారం ఇస్తూ చావులమదులం శ్మశానవాటిక దగ్గర అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. మృతదేహాన్ని తరలించడానికి రూ.7 వేలు ఇవ్వాలని అంబులెన్స్‌ డ్రైవర్‌ డిమాండ్‌ చేశారు. దీంతో అడిగినంత డబ్బులు ఇచ్చామని మృతుడి బంధువులు తెలిపారు.

Updated Date - 2020-08-08T17:04:44+05:30 IST