పెద్దపల్లి : కరోనాతో వ్యక్తి మృతి.. ట్రాక్టర్‌లో తరలించిన డాక్టర్

ABN , First Publish Date - 2020-07-13T15:42:34+05:30 IST

ఇటీవల నిజామాబాద్‌లో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో

పెద్దపల్లి : కరోనాతో వ్యక్తి మృతి.. ట్రాక్టర్‌లో తరలించిన డాక్టర్

పెద్దపల్లి : ఇటీవల నిజామాబాద్‌లో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తరలించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనాతో వ్యక్తి మృతి చెందగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్‌లో తరలించడానికి ప్రయత్నించారు. అయితే తాను ట్రాక్టర్‌ను నడపనని మున్సిపల్ డ్రైవర్ తెగేసి చెప్పేసి వాహనం వదిలివెళ్లిపోయాడు.


ట్రాక్టర్ నడిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడే ఉన్న సుల్తానాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీరామ్ పీపీఈ కిట్టు ధరించి ట్రాక్టర్ నడిపారు. మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లారు. కార్యక్రమాలు అన్నీ అయిపోయినంత వరకూ అక్కడే ఉన్న డాక్టర్ అనంతరం ఆస్పత్రికి వెళ్లారు. మానవత్వం చాటుకున్న డాక్టర్ శ్రీరామ్‌పై స్థానికులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ప్రభుత్వం రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మరీ ముఖ్యంగా కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న దవాఖానాల్లో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని జనాలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-13T15:42:34+05:30 IST