ఓ వైపు కరోనా.. మరోవైపు పాముల సయ్యాట

ABN , First Publish Date - 2020-06-29T22:40:50+05:30 IST

ఓ వైపు కరోనా పాములా విషయం కక్కుతూ జనాన్ని కాటేస్తూ వెళ్లిపోతుంటే..

ఓ వైపు కరోనా.. మరోవైపు పాముల సయ్యాట

ప్రకాశం జిల్లా: ఓ వైపు కరోనా పాములా విషయం కక్కుతూ జనాన్ని కాటేస్తూ వెళ్లిపోతుంటే.. మరోవైపు సాక్షాత్తూ సర్పాలే పెనవేసుకుని అడుగుల ఎత్తు లేచి మరీ సయ్యాటలాడాయి. ఇది చాలా అరుదని, కాలసర్ప దోషమున్నప్పుడే ఇలా చెలరేగిపోయి ప్రకృతి విపత్తును హెచ్చరిస్తాయని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి దృశ్యం ఈ మధ్య ఎక్కడా.. ఎవరూ చూడలేదు.


అసలు విషయానికి వస్తే ప్రకాశం జిల్లా, పర్చూరులో రెండు పాములు సయ్యాటలాడాయి. సుమారు రెండు అడుగులకు పైగా ఎగురుతూ విన్యాసాలు చేశాయి. దీన్ని పలువురు తిలకించారు. పర్చూరులోని వాగు కట్టపై రెండు పాములు నాట్యమాడాయి. ఈ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాలను చూసేందుకు స్థానికులు తరలి వచ్చారు.

Updated Date - 2020-06-29T22:40:50+05:30 IST