కొత్త కేసులు 14,440

ABN , First Publish Date - 2022-01-24T08:46:27+05:30 IST

రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

కొత్త కేసులు 14,440

30% పైగా పాజిటివిటీ నమోదు 

కరోనాతో మరో నలుగురు మృతి

ఎంపీ మార్గాని భరత్‌కు పాజిటివ్‌ 


అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 44,650 మందికి పరీక్షలు నిర్వహించగా 14,440 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఇక పాజిటివిటీ రేటులో దేశ సగటుతో రాష్ట్రం పోటీ పడుతోంది. వారం రోజులుగా కరోనా కేసులతో పాటు ఈ రేటు కూడా పెరుగుతూనే ఉంది. గురువారం 26.60శాతం, శుక్రవారం 29.67 శాతం, శనివారం 29.53 శాతం చొప్పున రికార్డవగా, ఆదివారం ఏకంగా 30.95 శాతం నమోదయింది. తాజాగా విశాఖపట్నంలో అత్యధికంగా 2,258 కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం 1,534, గుంటూరులో 1,458, ప్రకాశం 1,399, కర్నూలు 1,238, చిత్తూరు 1,198, నెల్లూరు 1,103, తూర్పుగోదావరి 1,012 చొప్పున కొత్త కేసులు బయటపడ్డాయి. ఒకరోజు వ్యవధిలో తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు 14,542కు పెరిగాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 83,610 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.  


వెంకయ్య కోలుకోవాలి: పవన్‌ 

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కరోనా బారినపడటం విచారకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నా రు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశ ప్రజల సేవలో నిమగ్నం కావాలని పవన్‌ ఆకాక్షించారు. 


స్కూళ్లకు సెలవులు ప్రకటించండి: మనోహర్‌ 

కరోనా కేసులు పెరిగినప్పుడు విద్యాసంస్థలు మూసివేయ డం గురించి చూద్దామని విద్యాశాఖ మంత్రి చెప్పినప్పుడు రా ష్ట్రంలో 4వేల కేసులు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు 14వేల కు పెరిగాయని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గుర్తుచేశారు. ఇవి కేసులు పెరిగినట్లు కాదా..? అని ఆ యన ప్రశ్నించారు. ఇంకా ఎన్ని వేల కేసులు రావాలని, ఎన్ని లక్షల యాక్టివ్‌ కేసులు ఉండాలని నిలదీశారు. రాష్ట్రంలో కరో నా బారినపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందన్నారు. ఫిబ్రవరి రెండోవారంవరకూ విద్యాసంస్థలను మూసివేస్తే చిన్నారులను రక్షించుకోనే అవకాశం ఉంటుందని మనోహర్‌ సూచించారు. 

Updated Date - 2022-01-24T08:46:27+05:30 IST