మరో 18 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-07-03T05:53:26+05:30 IST

గుంటూరు జిల్లాలో తాజాగా శనివారం 18 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 27 కేసులు నమోదైన విషయం తెలిసిందే.

మరో 18 కరోనా కేసులు

గుంటూరు (మెడికల్‌), జూలై 2: గుంటూరు జిల్లాలో తాజాగా శనివారం 18 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 27 కేసులు నమోదైన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా జిల్లా కేంద్రం గుంటూరులో పలువురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. మెడికల్‌, పారా మెడికల్‌ సిబ్బంది కరోనాకు గురై హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.  వ్యాధి లక్ష ణాల్లో అంత తీవ్రత లేకపోవడం ఊరట కలిగిస్తోంది. 

Updated Date - 2022-07-03T05:53:26+05:30 IST