కరోనా కొత్త కేసులు వారానికి రెట్టింపు

ABN , First Publish Date - 2021-04-17T07:43:38+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం రెట్టింపు సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనకర పరిణామమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు

కరోనా కొత్త కేసులు వారానికి రెట్టింపు

జెనీవా/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం రెట్టింపు సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనకర పరిణామమని  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు. రెండు నెలలుగా కరోనా కేసులు వారానికే రెట్టింపవుతూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయని వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో టెడ్రోస్‌ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభం వరకు కరోనా వ్యాప్తిని నియంత్రించిన దేశాల్లో ప్రస్తుతం కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ప్రారంభం వరకు కేవలం 900 కేసులు, 9 మరణాలు నమోదైన న్యూగినియాలో ఇప్పుడు 9వేలకుపైగా కేసులు, 83 మరణాలను గుర్తించినట్టు తెలిపారు. అన్ని దేశాలకు సమాన ప్రాధాన్యంతో వ్యాక్సిన్‌ను సరఫరా చేయాల్సిన అవసరాన్ని ఇది నిరూపిస్తోందని టెడ్రోస్‌ పేర్కొన్నారు. కాగా, కొవిడ్‌ వ్యాప్తి కట్టడి విషయంలో భారత్‌ అధ్వాన స్థాయిలో ఉన్నట్టు ఫిచ్‌ సొల్యూషన్స్‌ శుక్రవారం పేర్కొంది. ఇంతకు ముందెన్నడూ లేని ఇలాంటి సంక్షోభం ఆరోగ్య సంరక్షణ రంగంలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపిందని వెల్లడించింది.

Updated Date - 2021-04-17T07:43:38+05:30 IST