Apr 19 2021 @ 01:07AM

‘సర్కారు...’ సెట్‌లో కరోనా కలకలం

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సెట్‌లో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో గత వారం తాజా షెడ్యూల్‌ మొదలైంది. నాలుగు రోజులు చిత్రీకరణ చేశారు. అయితే, యూనిట్‌లో కీలక వ్యక్తి ఒకరు కరోనా బారిన పడటంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేశారు. ఇప్పుడు చిత్రబృందమంతటికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. అంతా సవ్యంగా ఉందనుకుంటే... ఈ నెలాఖరున మళ్లీ చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. కరోనా నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌తో పాటు ఈ వారంలో మహేశ్‌ పాల్గొనాల్సిన ఓ యాడ్‌ షూటింగ్‌ను సైతం క్యాన్సిల్‌ చేసినట్లు తెలుస్తోంది.