కణం దగ్గరే కరోనా కట్టడి: ఎంఐటీ

ABN , First Publish Date - 2020-04-01T06:09:22+05:30 IST

కరోనావైర్‌సను నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలోని ప్రముఖ సంస్థ ఎంఐటీ.. అసలు ఈ వైరస్‌ మానవ కణజాలంలోకి ప్రవేశించకుండా...

కణం దగ్గరే కరోనా కట్టడి: ఎంఐటీ

బోస్టన్‌ మార్చి 31: కరోనావైర్‌సను నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలోని ప్రముఖ సంస్థ ఎంఐటీ.. అసలు ఈ వైరస్‌ మానవ కణజాలంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి పరిశోధనలు నిర్వహిస్తోంది. మానవ కణంలోకి కరోనా చొరబడకుండా ఒక ఔషధాన్ని రూపొందించింది. తద్వారా కరోనాకు మరింత కచ్చితమైన చికిత్సను అందించడానికి అవకాశాలు మెరుగవ్వొచ్చు. తాము రూపొందించిన ఔషధం మానవ కణంపైన ఉండే ప్రొటీన్‌ను పోలి ఉంటుందని ఎంఐటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది కరోనావైర్‌సకు ఉండే ప్రొటీన్‌ను సమర్థంగా అడ్డుకోగలదని భావిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం కరోనావైర్‌సకు ఉండే కొమ్ములాంటి భాగంలోని ప్రొటీన్‌, తాము రూపొందించిన ప్రొటీన్‌ భాగాన్ని పరీక్షిస్తున్నట్టు తెలిపారు. వీటి పరస్పర చర్యలను అధ్యయనం చేయడం ద్వారా పరిశోధన ఫలితాలను నిర్థారిస్తారు.

Updated Date - 2020-04-01T06:09:22+05:30 IST