పనీ, మనీ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-04T11:25:50+05:30 IST

కరోనా లాక్‌డౌ న్‌ అసంఘటితరంగ కార్మికులపై తీవ్ర ప్రభావం చూ పుతోంది. పనుల్లేక, వేతనాలు వచ్చే మార్గం కన్పించక కుటుంబ పోషణ కష్టతరంగా మారింది.

పనీ, మనీ లాక్‌డౌన్‌

అసంఘటితరంగం అతలాకుతలం

 జిల్లాలో 5 లక్షలమందికిపైనే కార్మికులు

 ఉపాధి లేక ఇబ్బందులు 


ఒంగోలు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : కరోనా లాక్‌డౌ న్‌ అసంఘటితరంగ కార్మికులపై తీవ్ర ప్రభావం చూ పుతోంది. పనుల్లేక, వేతనాలు వచ్చే మార్గం కన్పించక కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఏప్రిల్‌ ప్రా రంభం కావడంతో ఇంటి అద్దె, కరెంటు బిల్లుల చె ల్లింపు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు లక్షల కు టుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రోజు వారీ కార్మికులకు పూట గడవడం కష్టమైంది. 


భవన నిర్మాణరంగంలోనే 2 లక్షల మంది..

ఒక్క భవన నిర్మాణ రంగంలోనే దాదాపు రెండు లక్షల మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వ్యవ సాయ, పాడి పరిశ్రమ తర్వాత ఎక్కువ మందికి భవ న నిర్మాణ రంగమే ఆధారం. అనేక మంది ఏ రోజు కూలి డబ్బులతో ఆ రోజు కుటుంబ అవసరాలు తీర్చు కొంటుంటారు. అలాంటి వారంతా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మారిన జీవన శైలిలో పెద్ద ఎత్తున యువత మోటారు రంగాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకొంది. ప్రైవేటు లారీలు, బస్సు డ్రైవ ర్లు, క్లీనర్లు, కారు డ్రైవర్లు, ఆటో నడుపుకొని వేలాది మంది జీవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆటోలు రో జువారీ అద్దెకు తీసుకొని  తిప్పుకుంటూ కిరాయి పోను మిగతా మొత్తం ఇంటికి తీసుకెళ్లి గడుపుకొనేవారు అనేక మంది ఉన్నారు. మరోవైపు ముఠా కార్మికులుగా  పట్టణ ప్రాంతాల్లో వేలాది మంది పని చేస్తున్నారు. లారీల్లో వచ్చే వివిధ రకాల సరుకును దుకాణాల వద్ద దించడం, అలాగే దుకాణం నుంచి కొనుగోలు చేసే స రుకును వాహనాల్లో  ఇళ్లకు చేర్చడంలో వీరి పాత్ర అధికారం. జిల్లాలో ఆయా పట్టణాల స్థాయిని బట్టి ఒ క్కో చోట 100 నుంచి 1000 మంది వరకూ ముఠా కూలీలు ఉంటారు.


అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చీమకుర్తి, బల్లికురవ, గుండ్లాపల్లి గ్రోత్‌ సెం టర్‌, ఒంగోలు, మార్కాపురం ఇతరత్రా ప్రాంతాల్లోని గ్రానైట్‌ ఇతర పరిశ్రమలు, క్వారీలలో అసంఘటిత రంగంలో పనిచేసేవారు దాదాపు పాతికవేల మంది వరకూ ఉన్నారు. ఇతర అనేక రంగాల్లో వేల సంఖ్య లోనే ఈతరహా కార్మికులు పనిచేస్తున్నారు. అందులో పట్టణాల్లోని వివిధ దుకాణాల్లో పనిచేసే గుమస్తాల సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పని లేక, వేతనాలు రాక వీరి కుటుంబాలు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


టెన్షన్‌..టెన్షన్‌..

అసంఘటిత కార్మికుల్లో అత్యధికుల రోజువారీ వేతనం రూ. 300 నుంచి రూ. 700 లోపుగానే ఉం టుంది. అలా నెలంతా  పనిచేస్తే వారికి వచ్చేది రూ. 10 వేల నుంచి రూ. 20వేల లోపే.  ఆ మొత్తంతోనే కుటుంబాన్ని పోషించాలి. వీరిలో ఎక్కువ మంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో ప్రతి నెలా అద్దె చెల్లించడంతోపాటు, ని త్యావసర సరుకులు, పాలు, కరెం టు బిల్లులు, ఇతరత్రా కనీస అవస రాలకే అంతంత మాత్రంగా వీరి సంపాదన సరిపో తుంది. రెండు, మూడు రోజులు ఏదైనా కారణంతో ప నులకు వెళ్లలేకపోతే ఆ కుటుంబాల పరిస్థితి తారు మారవుతుంది. అలాంటిది ప్రస్తుత లాక్‌డౌన్‌తో ఇప్ప టికే ఎనిమిది రోజులుగా పనులు నిలిచిపోయాయి. మ రో పక్షంపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ సమ యంలో ఏప్రిల్‌ ప్రారంభమవ డంతో వారిలో టెన్షన్‌ ప్రారంభమైంది. అద్దె, కరెంటు బి ల్లు కట్టాలి. సరుకులు కొను గోలు చేయాలి. కానీ ప నులు నిలిచిపోయి వే తనాలు వచ్చే పరి స్థితి లేకపోవ డం తో ఆ కుటుంబా లు ఆందోళన చెందుతు న్నా యి. మొత్తంగా అసంఘటిత రం గంలో పనిచేసే కూలీలు, కార్మికులు, చిరు ద్యోగులు కుటుం బాలు ప్రస్తుతం కరోనా దెబ్బతో అతలాకుతలం అవుతున్నాయి.

Updated Date - 2020-04-04T11:25:50+05:30 IST