Abn logo
Sep 10 2021 @ 03:20AM

అసిస్టెంట్‌ ఫిజియోకు కరోనా కోహ్లీ సేనకు నెగెటివ్‌

మాంచెస్టర్‌: టీమిండియాలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా అసిస్టెంట్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో జట్టు ఒక్కసారి గా షాక్‌కు గురైంది. వెంటనే ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేయడంతో పాటు ఆటగాళ్లందరినీ హోటల్‌ గదులకే పరిమితం కావాలని ఆదేశించారు. ఎందుకంటే బుధవా రం జరిగిన ప్రాక్టీస్‌లో క్రికెటర్లతో పాటు యోగేశ్‌ కూ డా ఉన్నాడు. దీంతో అసలు ఐదో టెస్టు జరుగుతుందా? లేదా? అనే సస్పెన్స్‌ కొనసాగింది. ఈ నేపథ్యంలో గురు వారం ఉదయం 21 మంది ఆటగాళ్లకు మరోసారి ఆర్‌ టీ పీసీఆర్‌ టెస్టులను నిర్వహించారు. ఈ ఫలితం పైనే మ్యాచ్‌ ఆధారపడి ఉండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. చివరకు రాత్రి వచ్చిన రిజల్ట్స్‌లో జట్టు ఆటగాళ్లందరూ నెగెటివ్‌గా తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు మ్యాచ్‌ కొనసాగేందుకు కూడా దారి సుగమమైనట్టయింది. అయితే ఓ సీనియర్‌ క్రికెట ర్‌ మాత్రం ఆడేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. ఇప్పటికే ప్రధాన కోచ్‌ రవిశాస్ర్తి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ పాజిటివ్‌గా తేలి లండన్‌లోనే ఉండిపోయారు.


పటేల్‌ గైర్హాజరీ కారణంగా..:

రవిశాస్ర్తి గత ఆదివారం పాజిటివ్‌గా తేలిన వెంటనే జట్టు ఫిజియో నితిన్‌ పటేల్‌ ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అత డు నెగెటివ్‌గా తేలాడు. అయినా ఆటగాళ్లతో కాకుండా అదే హోటల్‌ వేరే ఫ్లోర్‌లో ఉంటున్నాడు. దీంతో పటేల్‌ స్థానంలో యోగేశ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సమ యంలో తను రోహిత్‌, పుజార, జడేజా (మోకాలి నొప్పు లు) ఇతర ఆటగాళ్లకు కూడా చికిత్స చేశాడు.  


వ్యాక్సినేషన్‌ పూర్తయినా...

క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా ఇదివరకే కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. అయితే ఇంగ్లండ్‌లో ఇరు జట్లకు కఠిన బయో బబుల్‌ అమలు కావ డం లేదు. యూకేలో ప్రజా జీవితం మామూలు స్థితికి రావడంతో బబుల్‌పై చూసీచూడనట్టుగానే ఉంటున్నా రు. అందుకే లండన్‌లోని టీమ్‌ హోటల్‌లో జరిగిన పుస్తకావిష్కరణకు  రవిశాస్త్రి, కోహ్లీ, భరత్‌ అరుణ్‌, నితిన్‌ పటేల్‌, శ్రీధర్‌ హాజరయ్యారు. ఈ ఉదంతంపై ఇప్పటికే బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.