అందుబాటులోకి ‘కరోనా కవచ్‌’

ABN , First Publish Date - 2020-03-28T08:59:32+05:30 IST

పరిసర ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై సమాచారాన్నిచ్చే సరికొత్త యాప్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ‘కరోనా కవచ్‌’ అనే పేరున్న ఈ యాప్‌ను కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ..

అందుబాటులోకి ‘కరోనా కవచ్‌’

న్యూఢిల్లీ, మార్చి 27 : పరిసర ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై సమాచారాన్నిచ్చే సరికొత్త యాప్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ‘కరోనా కవచ్‌’ అనే పేరున్న ఈ యాప్‌ను కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా అభివృద్ధిచేశాయి. ఇది గంటకోసారి వినియోగదారుడి లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తుంది. అతడి పరిసర ప్రాంతాల్లో కరోనా బాధితులు ఉంటే ఒక రంగును.. చుట్టుపక్క ప్రాంతాల్లో బాధితులు అస్సలు లేకుంటే మరో రంగును సూచించి అప్రమత్తం చేస్తుంటుంది. ప్రస్తుతం ఇది బీటా వర్షన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.  

Updated Date - 2020-03-28T08:59:32+05:30 IST