నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-12T02:22:18+05:30 IST

నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

నల్గొండ: నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 15 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు స్పష్టమవుతోంది. 90 మంది విద్యార్థులు స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నట్టు సమాచారం తెలుస్తోంది. కళాశాల యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది. టెస్టులకు వెళ్లకుండా కళాశాల యాజమాన్యం తమను బంధించారంటూ ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు బాధిత విద్యార్థి తెలియజేశాడు.


కామినేని ఘటనపై యాజమాన్యం స్పందించింది. విద్యార్థులకు కరోనా సోకిందన్న విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందనేది అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ అన్నారు. మంత్రి కేటీఆర్‌కి తమ విద్యార్థులు ట్వీట్‌ చేశారనేది కూడా అవాస్తవమేనని ఆయన అన్నారు. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నార్కట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Updated Date - 2022-01-12T02:22:18+05:30 IST