కరోనా టెస్టింగ్‌కు కష్టాలు

ABN , First Publish Date - 2021-04-17T06:05:00+05:30 IST

కరోనా కలవర పెడుతున్న తరుణంలోనూ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది.

కరోనా టెస్టింగ్‌కు కష్టాలు

శాంపిళ్లు తీసేందుకు కిట్ల కొరత 

తీసినా ఐడీ నమోదుకు సర్వర్‌ సమస్య 

ఫలితం కోసం రోజుల తరబడి ఎదురుచూపులు


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 16: కరోనా కలవర పెడుతున్న తరుణంలోనూ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో అధికారులు కొవిడ్‌ టెస్టింగ్‌లకు ఎంతో ప్రాధాన్యమివ్వాలి. అటువైపు జిల్లా యంత్రాంగం ఆలోచించకపోవడంతో జనం అవస్థలు పడాల్సి వస్తోంది. టెస్టింగ్‌ కిట్ల కొరత ఉండటంతో శాంపిళ్లు తీయడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ శాంపిళ్లు తీసినా వారి చిరునామా ఆనలైనలో న మోదు చేసి, ఐడీ నంబర్‌ ఇవ్వడానికి సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. జిల్లా సర్వజనాస్పత్రిలో ఉన్న కొవిడ్‌ ఓపీకి టెస్టింగ్‌ల కోసం వందలమంది తరలి వస్తున్నారు. రోజూ 500 మందికి పైగానే ఇక్కడ టెస్టింగ్‌లు చేస్తున్నారు. అవసరమైన సిబ్బం ది లేకపోవడంతో శాంపిళ్లు తీసినా వారి నమూనా ల వివరాలను ఆనలైనలో నమోదు చేయలేకపోతున్నారు. శాంపిళ్లపైన పేరు రాసుకొని, పంపిస్తున్నా రు. ఆ శాంపిళ్లు ఆనలైనలో నమోదు చేసి, ఐడీ నంబర్‌ కేటాయించి వైద్య కళాశాల ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ వాటిని పరీక్షించి, పాజిటివా... నెగిటివా అని సమాచారం ఫోన్లకు పంపుతారు. జిల్లా ఆస్పత్రిలో తీసిన దాదాపు 2 వేల శాంపిళ్లు ల్యాబ్‌కే వెళ్లలేదని వైద్య వర్గాలే చెబుతున్నాయి. దీంతో ఆ శాంపిళ్లు ఏమయ్యాయో కూడా అర్థం కాని పరిస్థితి. శాంపిళ్లు ఇచ్చిన బాధితులు మాత్రం రోజుల తరబడి ఫలితం కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. పీహెచసీలకు రోజుకు 10 నుంచి 15 కిట్లు ఇస్తున్నారు. అక్కడ కూడా శాంపిళ్లు తీసినా సర్వర్‌ సమస్యతో సకాలంలో ఫలితాలు తెలియజేయడం లేదు. పరిస్థితి ఇలా ఉన్నా.. వైద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్ర త్యేక దృష్టి పెట్టి, సమస్య లేకుండా చూడాలని అ నంత జనం కోరుతున్నారు.


Updated Date - 2021-04-17T06:05:00+05:30 IST