కోలుకున్న రోగుల నుంచీ కరోనా వ్యాప్తి!!

ABN , First Publish Date - 2020-04-06T07:22:43+05:30 IST

కరోనా బారినపడిన వ్యక్తి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా అతడి నుంచి ఇన్ఫెక్షన్‌ ఇతరులకు సోకే అవకాశాలు ఉంటాయని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం దగ్గు, తుమ్ము, శ్వాసకోశ సమస్యలున్న...

కోలుకున్న రోగుల నుంచీ కరోనా వ్యాప్తి!!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: కరోనా బారినపడిన వ్యక్తి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా అతడి నుంచి ఇన్ఫెక్షన్‌ ఇతరులకు సోకే అవకాశాలు ఉంటాయని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం దగ్గు, తుమ్ము, శ్వాసకోశ సమస్యలున్న రోగి నుంచే ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తుందని భావించడం సరికాదన్నారు. వైద్యులు స్వప్నీల్‌ పారిఖ్‌(ఇంటర్నల్‌ మెడిసిన్‌), మహేరా దేశాయ్‌(క్లినికల్‌ సైకాలజిస్ట్‌), రాజేశ్‌ ఎం.పారిఖ్‌(న్యూరో సైకియాట్రి్‌స్ట)లు సంయుక్తంగా రాసిన ‘ది కరోనావైరస్‌ : వాట్‌ యు నీడ్‌ టు నో ఎబౌట్‌ ది గ్లోబల్‌ ప్యాండెమిక్‌’ అనే పుస్తకంలో ఈవివరాలను ప్రస్తావించారు.  


Updated Date - 2020-04-06T07:22:43+05:30 IST