సర్వేలకు రక్షణేది ?

ABN , First Publish Date - 2020-04-03T11:47:19+05:30 IST

జిల్లాలో కరోనాఛాయలు దాదాపు లేనట్టేనని కుదుట పడుతున్న వేళ ఒక్కసారిగా నిజాముద్దీన్‌ (ఢిల్లీ) కార్యక్రమంలో పాల్గొన్న వారి నుంచి బయట పడిన పాజిటివ్‌ కేసులతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

సర్వేలకు రక్షణేది ?

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 2 : జిల్లాలో కరోనాఛాయలు దాదాపు లేనట్టేనని కుదుట పడుతున్న వేళ ఒక్కసారిగా నిజాముద్దీన్‌ (ఢిల్లీ) కార్యక్రమంలో పాల్గొన్న వారి నుంచి బయట పడిన పాజిటివ్‌ కేసులతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో సం బంధిత వ్యక్తులు వున్న నివాసాలను ఏపీ సెంటర్‌ (కేంద్ర స్థానం) గా తీసుకుని 150 మీటర్ల పరిధి (రెడ్‌జోన్‌) లోని ప్రతీ గృహాన్ని నిత్యం సందర్శిం చేందుకు పెద్ద సంఖ్యలో వైద్య బృందాలను నియ మించింది. ఏపీ సెంటర్‌కు మూడు కిలోమీటర్ల (బఫర్‌ జోన్‌) పరిధిలోని ప్రతీ కుటుంబాన్ని 14 రోజుల పాటు ఆరోగ్య సర్వే చేయడానికి వైద్య సిబ్బందిని రంగంలోకి దింపింది. ఆ మేరకు మైక్రో యాక్షన్‌ ప్లాన్‌తో సూక్ష్మ స్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణను చేపట్టింది. కార్యాచరణ సమగ్రంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందికి కరనా వైరస్‌ సోకకుండా సామగ్రిని సకాలంలో ఇవ్వడంలో ఒకింత విఫలమవు తుండ డంతో వైద్య బృందా ల్లో భయాం దోళ నలు నెలకొ న్నాయి.


భయాందోళనల్లో వైద్య సిబ్బంది

నిజాముద్దీన్‌ (ఢిల్లీ) ప్రయా ణికుల్లో పాజిటివ్‌ కేసులు నిర్ధార ణ అయిన ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టిన మైక్రో యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు తగినట్టుగానే వైద్య బృందాల నియామకాలు జరిగాయి. ఆ ప్రకారం ఒక్కో బృందంలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, అంగన్‌వాడీ టీచర్‌ ఉంటారు. వీరికి సహాయకులుగా గ్రామ వలంటీర్లు వ్యవహరిస్తారు. నిర్ధేశిత రెడ్‌, బఫర్‌ జోన్లకు ఈ బృందాలు వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించి ఎవరైనా దగ్గు, జ్వరం, ఆయాసం, జలుబు వంటి కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతుంటే నమోదు చేస్తారు. సంబంధిత లక్షణాలతో బాధపడే వ్యక్తికి వైద్యాఽధికారి పర్యవేక్షణలో సేవలందుతాయి.


తీవ్ర అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి తరలిస్తారు. ఇలా జిల్లాలో మొత్తం 4,698 మంది వైద్య సిబ్బందిని రెడ్‌, బఫర్‌ జోన్లకు ఆయా పీహెచ్‌సీల నుంచి డిప్యూటేషన్లపై విధులు కేటాయిం చారు. డబ్ల్యుహెచ్‌వో, ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు ప్రతీ ఆరు గంటల వ్యవధికి ఒకటి చొప్పున మూడు లేయర్ల సర్జికల్‌ మాస్కును లెక్కించి వలంటీర్లకు మినహా మిగతా వైద్య సిబ్బందికి ఇవ్వాలి. హ్యాండ్‌ గ్లౌజ్‌, శానిటైజర్లను ఇవ్వాలి. ఆరోగ్య సర్వే నిమిత్తం సంబంధిత ప్రాంతాల్లోని నివాసాలకు వెళ్లినప్పుడు ఏవైనా వస్తువులను తాకినప్పుడు వైరస్‌ తమకు సంక్రమించే ప్రమాదాలు లేకపోలేదని వైద్య సిబ్బంది భయపడుతున్నారు.


డివిజన్ల వారీగా సబ్‌ స్టోర్‌లతోనే మేలు

మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు వంటి వైద్యరక్షణ సామగ్రిని డివిజన్‌ స్థాయిలో సబ్‌ స్టోర్‌లను ఏర్పాటుచేసి, పంపిణీ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుస్తోం ది. ఫార్మాసిస్టుల ఆధ్వర్యంలో వైద్య బృందాలకు నేతృత్వం వహించే సూపర్‌వైజర్ల ద్వారా ప్రతీ మూడు రోజులకు ఒకసారి వీటిని పంపిణీ చేస్తే పారదర్శకత ఉంటుంది. 


నిల్వలు ఫుల్‌.. క్షేత్ర స్థాయిలో నిల్‌ 

జిల్లాలో చేపట్టిన కరోనా వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా గత నెలలో సర్వే నిర్వహించారు. అప్పట్లో వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. తాజాగా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో చేపట్టిన మైక్రో యాక్షన్‌ ప్లాన్‌లో పాల్గొంటున్న సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు అందలేదు. కొందరి సిబ్బంది పాత వాటిని వినియోగి స్తుండగా, మరికొందరు వస్ర్తాన్ని మాస్కులుగా వాడుతున్నారు. వాస్తవానికి అవసరమైన మేర శానిటైజర్లు, మాస్కుల నిల్వలు జిల్లా కేంద్రంలో ఉన్నాయి. వీటిని క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బందికి అందజేయ లేక పోతున్నారు. పీహెచ్‌సీల వారీగా నిల్వలు పంపిస్తున్నప్పటికీ పర్యవేక్షణ లేక దుర్విని యోగం అవుతున్నాయి. పలు శాఖల నుంచి ఒత్తిళ్లు తెచ్చి వైద్య రక్షణ సామగ్రిని జిల్లా కేంద్రం నుంచి తీసుకోలేక పోతుండడం వల్ల క్షేత్రస్థాయిలో సిబ్బందికి అందడం లేదు.

Updated Date - 2020-04-03T11:47:19+05:30 IST