పుదుచ్చేరిలో కరోనా విలయతాండవం

ABN , First Publish Date - 2021-05-12T17:41:28+05:30 IST

కొవిడ్‌-19 కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి ప్రజలను కల్లోల పరుస్తోంది. సోమవారం ఒక్కరోజే 2,049 మందికి కరోనా

పుదుచ్చేరిలో కరోనా విలయతాండవం

ఒకేరోజు 2,049 పాజిటివ్‌ కేసులు- 30 మంది మృతి

చెన్నై/ప్యారీస్‌: కొవిడ్‌-19 కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి ప్రజలను కల్లోల పరుస్తోంది. సోమవారం ఒక్కరోజే 2,049 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, చికిత్సలు ఫలించక 30 మంది మృత్యువాతపడ్డారు. గత ఏడాది హఠాత్తుగా భారత్‌లో కొవిడ్‌ అందరిపైనా విరుచుకుపడింది. సంవత్సర కాలంలో వేలాది మంది కరోనా కాటుకు బలైపోయారు. కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ కూడా వేగంగా విజృంభిస్తూ వస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమక్రమంగా 3.80 లక్షలకు చేరింది. దీంతో, వైరస్‌ అధికంగా ఉన్నట్టు గుర్తించిన రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. ఇందులో భాగంగా పుదుచ్చేరి రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంగా చర్యలు చేపట్టినప్పటికీ, వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 75,024 మంది కరోనా సోకగా, 1,018 మంది మృతిచెందారు.

Updated Date - 2021-05-12T17:41:28+05:30 IST