చైనా ఐస్‌ క్రీమ్‌లో కరోనా

ABN , First Publish Date - 2021-01-18T07:50:45+05:30 IST

కరోనా పుట్టుకకు మూలం తేలకముందే.. చైనాలో మరోసారి కలకలం. ఆ దేశంలో తాజాగా ఐస్‌క్రీమ్‌లో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయి.

చైనా ఐస్‌ క్రీమ్‌లో కరోనా

తియాన్జిన్‌లో గుర్తింపు

క్వారంటైన్‌లోకి 1600 మంది


కరోనా పుట్టుకకు మూలం తేలకముందే.. చైనాలో మరోసారి కలకలం. ఆ దేశంలో తాజాగా ఐస్‌క్రీమ్‌లో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయి. బీజింగ్‌ సమీప తియాన్జిన్‌ నగరంలో డాకియోడవో ఫుడ్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఐస్‌క్రీమ్‌ శాంపిళ్లు మూడింటిలో వైర్‌సను గుర్తించారు. దీంతో ఆ సంస్థ 1,600 మంది కార్మికులను క్వారంటైన్‌ చేసింది. పరీక్షల్లో వీరిలో 700 మందికి నెగెటివ్‌ వచ్చింది. ఓ వ్యక్తి ద్వారా వ్యాపించి ఉండవచ్చని ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మొత్తం 29 వేల ఐస్‌క్రీం కార్టన్లకు తియాన్జిన్‌లో 390 కార్టన్లు విక్రయించారు. మిగతావి వెనక్కురప్పించారు. 2,089 బాక్సులను సీల్‌ చేశారు. 836 బాక్సులను కలుషితమైనవిగా తేల్చారు. ఉక్రెయిన్‌, న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న ముడిపదార్థాలను ఈ ఐస్‌క్రీమ్‌ తయారీకి ఉపయోగించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2021-01-18T07:50:45+05:30 IST