టైర్‌-1 నగరాల్లో కరోనాపై అవగాహన ఎక్కువ

ABN , First Publish Date - 2020-04-03T07:18:01+05:30 IST

లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత రోజువారీ ప్రయాణాల వల్ల కరోనా వ్యాప్తిపై ఐఐటీహెచ్‌, ఐఐటీ బాంబే పరిశోధకులు సంయుక్త అధ్యనయం చేశారు. టైర్‌-2, టైర్‌-3 నగరాలతో పోల్చితే హైదరాబాద్‌...

టైర్‌-1 నగరాల్లో కరోనాపై అవగాహన ఎక్కువ

ఐఐటీ హైదరాబాద్‌-బాంబే సంయుక్త సర్వేలో వెల్లడి


కంది, ఏప్రిల్‌ 2: లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత రోజువారీ ప్రయాణాల వల్ల కరోనా వ్యాప్తిపై ఐఐటీహెచ్‌, ఐఐటీ బాంబే పరిశోధకులు సంయుక్త అధ్యనయం చేశారు. టైర్‌-2, టైర్‌-3 నగరాలతో పోల్చితే హైదరాబాద్‌, బెంగళూరు లాంటి టైర్‌-1 నగరాల్లో కరోనాపై అవగాహన ఎక్కువగా ఉందని ఆ అధ్యయనంలో వెల్లడైందన్నారు. లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల ప్రజా రవాణా రద్దు కావడంతో ప్రజలు వైర్‌సకి గురయ్యే ప్రమాదం తగ్గిందని చెప్పారు. ఈ అధ్యయనంలో 1,900 మంది పరిశోధకులు పాల్గొన్నారు. రోజువారీ రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా సేకరించారు.

Updated Date - 2020-04-03T07:18:01+05:30 IST