మన కరోనా భిన్నమైనదే!

ABN , First Publish Date - 2020-04-05T07:04:07+05:30 IST

మన దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైర్‌సకు చైనాలో ప్రబలిన వైర్‌సకు తేడాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో వ్యాపించిన వైర్‌సతో పోలిస్తే మన వద్ద ఉన్న వైరస్‌ బలహీనం...

మన కరోనా భిన్నమైనదే!

కానీ తీవ్రతలో తేడా లేదు

రెండు నెలల్లో స్వదేశీ టెస్ట్‌ కిట్‌లు

ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త గంగాఖేద్గర్‌


మన దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైర్‌సకు చైనాలో ప్రబలిన వైర్‌సకు తేడాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో వ్యాపించిన వైర్‌సతో పోలిస్తే మన వద్ద ఉన్న వైరస్‌ బలహీనంగా ఉందని కూడా కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలపై స్పష్టత కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఎపిడమాలజీ అండ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ డివిజిన్‌ హెడ్‌ డాక్టర్‌ గంగాఖేద్గర్‌తో ఆంధ్రజ్యోతి ప్రతినిధి సంభాషించారు. ఆ వివరాలివి..


ప్రశ్న: మన దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ బలహీనమైనదా?

జవాబు: చైనాలో మొదట వ్యాపించిన వైర్‌సకు మన దేశంలో వ్యాపిస్తున్న వైర్‌సకు మధ్య తేడాలున్నాయి. మన దేశంలో వ్యాపిస్తున్న సార్స్‌ కొవిడ్‌ వైర్‌సలో కొన్ని మార్పులు వచ్చాయి. అయితే ఈ వైరస్‌ వ్యాపిస్తున్న తీరులో కానీ.. ఒకసారి శరీరంలో ప్రవేశించిన తర్వాత కణాల్లో చొచ్చుకుపోతున్న వేగంలో కానీ ఎటువంటి తేడా లేదు. దీనిపై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే కానీ ఈ విషయంలో స్పష్టత రాదు. 


ప్రశ్న: మిగిలిన దేశాల్లో వ్యాపిస్తున్న వైర్‌సతో పోల్చి చూస్తే ఈ విషయంలో స్పష్టత వస్తుంది కదా?

జవాబు: మన దేశంలో జరుగుతున్న పరిశోధన ఆధారంగా చూస్తే కరోనా వైర్‌సలో మూడు భిన్నమైన సబ్‌స్పీసి్‌సలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకేలా వ్యాపిస్తున్నాయి. ఇతర దేశాల్లోనూ ఇదేవిధంగా ఉండొచ్చు.  


ప్రశ్న: స్వదేశీ కిట్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

జవాబు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కిట్‌లు ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కిట్‌ల తయారీకి అనేక పరిశోధనా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.  


ప్రశ్న: మన దేశంలో వచ్చే కొన్ని రోజుల్లో కేసులు పెరిగిపోయే  అవకాశముందా? మిగిలిన దేశాల అనుభవాలేమి చెబుతున్నాయి?

జవాబు: కేసులు పెరుగుతాయా? లేదా? అవి ఎలా పెరుగుతాయనే విషయాన్ని అంచనా వేయటం చాలా కష్టం. మన దేశం చాలా పెద్దది. భిన్నమైన భౌగోళిక ప్రాంతాలు.. జన్యు సమూహాలు.. ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నాయి. అందువల్ల వైరస్‌ వ్యాప్తిని కచ్చితంగా అంచనా వేయటం కూడా కష్టమే! ఇతర దేశాల్లో ఇంత వైవిధ్యం ఉండదు. అందువల్ల వారికి అంచనాలు సులభమవుతాయి.


- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-04-05T07:04:07+05:30 IST