గుంటూరు జిల్లాపై కరోనా పంజా

ABN , First Publish Date - 2022-01-18T00:22:48+05:30 IST

గుంటూరు జిల్లాలో ఒక్క రోజులోనే కేసులు విపరీతంగా పెరిగాయి. వారం నుంచి క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న

గుంటూరు జిల్లాపై కరోనా పంజా

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒక్క రోజులోనే కేసులు విపరీతంగా పెరిగాయి. వారం నుంచి క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య పెద్దగా లేదు. దీంతో వైరస్‌ విస్తరణను అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. సంక్రాంతి మూడు రోజులు పండుగ ముగిసిన తర్వాత ఒక్కసారిగా సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కరోనాతో వచ్చిన రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం వరకు కేవలం 30 మంది లోపే చికిత్స పొందుతుండగా 100 బెడ్లను కేటాయించారు. సోమవారం మొత్తం బెడ్లు నిండిపోవడంతో అప్రమత్తమైన అధికారులు అప్పటికపుడు జనరల్‌ మెడిసిన్‌ విభాగంలోని మరో రెండు వార్డులను ప్రత్యేకంగా కేటాయించారు. సోమవారం రాత్రికి ఆ బెడ్లు కూడా నిండిపోయే పరిస్థితులున్నాయి. ఇక సోమవారం నుంచి తెరుచుకున్న విద్యాసంస్థలకు 30 శాతమే విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కువ ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో తల్లిదండ్రులు కూడా సోమవారం పాఠశాలలకు పంపించేందుకు సుముఖత చూపలేదు. 

Updated Date - 2022-01-18T00:22:48+05:30 IST