గ్రేటర్‌ను వీడని కరోనా

ABN , First Publish Date - 2022-01-24T23:17:30+05:30 IST

గ్రేటర్‌లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. జిల్లాలో పొల్చితే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికంగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి.

గ్రేటర్‌ను వీడని కరోనా

హైదరాబాద్: గ్రేటర్‌లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. జిల్లాలో పొల్చితే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికంగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీహెచ్‌సీ కేంద్రాల్లో కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టెస్ట్‌లు చేయించుకునేం దుకు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌లలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.  ఓ పక్క కరోనా నిర్ధారణ పరీక్షలు, మరో పక్క వ్యాక్సినేషన్‌.. సిటీ జనం ఆస్పత్రుల ఎదుట క్యూ కడుతున్నారు. సీజనల్‌ వ్యాధులూ విజృంభిస్తుండటంతో చిన్న క్లినిక్‌లకు బాధితుల తాకిడి పెరుగుతోంది. గ్రేటర్‌లో ఫీవర్‌ సర్వేను జీహెచ్‌ఎంసీ బృందాలు ప్రారంభించాయి. బస్తీలు, కాలనీల్లో వైద్యసిబ్బందితో కలిసి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్‌ సర్వే చేపడుతున్నారు. గ్రేటర్‌లో సుమారు 1,400కు పైగా బృందాలు ఫీవర్‌ సర్వేలో పాల్గొంటున్నాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-24T23:17:30+05:30 IST