Abn logo
Sep 25 2021 @ 01:10AM

నక్కపల్లి కేజీబీవీలో ముగ్గురు బాలికలకు కరోనా


నక్కపల్లి, సెప్టెంబరు 24 : ఇక్కడి కేజీబీవీలో ముగ్గురు బాలికలకు  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగినట్టు గొడిచెర్ల పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. టీచర్ల సూచనల మేరకు గురువారం ఈ విద్యాలయంలో  సుమారు 135 మంది విద్యార్థినులకు కొవిడ్‌ పరీక్షలు జరిపామన్నారు. అందులో ముగ్గురికి వైరస్‌ సోకినట్టు తేలడంతో వారిని స్వగ్రామాలకు పంపి, హోం ఐసోలేషన్‌లో ఉంచినట్టు చెప్పారు.