59 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-17T05:33:30+05:30 IST

59 మందికి కరోనా

59 మందికి కరోనా

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఆదివారం ఏడు కేంద్రాలతోపాటు రెండు మొబైల్‌ టీంల ద్వారా 206 మందికి కరోనా యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించారు. 59 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలో 8, అబ్దుల్లాపూర్‌మెట్‌ 3, యాచారం 6, ఆరుట్ల 10, మంచాల 6, దండుమైలారం 3, రాగన్నగూడ 12, మొబైల్‌ టెస్టుల్లో 11 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని ఆయా మండలాల వైద్యాధికారులు పేర్కొన్నారు.


  • తలకొండపల్లి మండలంలో 10 మందికి కరోనా


ఙఆమనగల్లు: తలకొండపల్లి, గట్టిప్పలపల్లి ఆరోగ్య కేంద్రాల్లో 31 మందికి పరీక్షలు నిర్వహించగా 10మందికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్లు శారద, అజీం తెలిపారు. 


  • యాచారం మండలంలో 17 పాజిటివ్‌ కేసులు


యాచారం: యాచారం పీహెచ్‌సీలో పది మందికి యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి  పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. యాచారంలో ఇద్దరికి, గున్గల్‌, బొల్లిగుట్టతండా, కుర్మిద్దతండా, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. మొబైల్‌ టీం ద్వారా చింతపట్లలో 30 మదికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. 


  • శంషాబాద్‌లో 18 పాజిటివ్‌ కేసుల నమోదు


శంషాబాద్‌: శంషాబాద్‌లోని ఆరోగ్య కేంద్రంలో 75మందికి పరీక్షలు నిర్వహించగా 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డాక్టర్‌ నజ్మాబాను తెలిపారు.


  • చేవెళ్ల డివిజన్‌లో 41 మందికి పాజిటివ్‌


చేవెళ్ల: చేవెళ్ల డివిజన్‌లో ఆదివారం 183 మందికి కరోనా పరీక్షలు చేయగా 41 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. చేవెళ్ల మండలంలో 61 మందికి పరీక్ష చేస్తే 14 మందికి, షాబాద్‌ మండలంలో 47కు 17మందికి, శంకర్‌పల్లిలో 50కి ఆరుగురికి, మొయినాబాద్‌ మండలంలో 25 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని ఆయా మండల వైద్యాధికారులు వివరించారు.


  • షాద్‌నగర్‌ డివిజన్‌లో 44 మందికి కరోనా నిర్ధారణ


షాద్‌నగర్‌ రూరల్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో ఆదివారం 190 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి పాజిటివ్‌ వచ్చిందని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ టి.దామోదర్‌ తెలిపారు. చించోడులో 6, కేశంపేటలో 6, కొత్తూరులో 14, షాద్‌నగర్‌ సీహెచ్‌సీలో 18 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆయన వివరించారు.

Updated Date - 2021-05-17T05:33:30+05:30 IST