వెంటాడుతున్న కరోనా భయం

ABN , First Publish Date - 2020-08-03T19:58:22+05:30 IST

జగిత్యాల జిల్లాలో కరోనా వైరస్‌ క లవరపెడుతోంది. రోజురోజుకూ జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండగా, జాగ్రత్తలు తీసుకుంటేనే మేలని వైద్యులు సూచిస్తున్నారు.

వెంటాడుతున్న కరోనా భయం

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 445 మందికి పాజిటివ్‌

హోం ఐసోలేషన్‌లో 296 మంది

ఇంటి చికిత్సే మేలంటున్న వైద్యులు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. రోజురోజుకూ జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండగా, జాగ్రత్తలు తీసుకుంటేనే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం పాజిటివ్‌ వచ్చినా వ్యాధి లక్షణాలు లేనివారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తుంది. 


జిల్లాలో 445 మందికి కరోనా పాజిటివ్‌ జగిత్యా ల జిల్లాలో ఇప్పటివరకు 445 మందికి కరోనా పా జిటివ్‌ వచ్చింది. ఇందులో ఇప్పటివరకు ఆరుగురు మరణించగా, 132 మంది రికవరీ అయ్యారు. 307 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే 307 మందిలో 296 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతుండగా, కేవలం 11 మంది మాత్రమే హై దరాబాద్‌, కరీంనగర్‌ లాంటి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే 132 మంది వ్యాధి బారి న పడి ఇప్పటికే కోలుకున్నారు. ఇందులో 104 మం ది హోం క్వారంటైన్‌లో ఉండి వ్యాధి బారి నుంచి బయటపడ్డారు. కేవలం 28 మంది మాత్రమే ప్రభు త్వ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుని వ్యాధి బా రి నుంచి బయటపడ్డారు. దీంతో హోం క్వారంటైన్‌ లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నుం  చి బయట పడటంతో పాటు కమ్యూనిటీ స్ర్పెడ్‌ కా కుండా చూడటంతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పడే అవకాశం ఉంది.


హోం క్వారంటైన్‌లో జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి విముక్తి

కరోనా పాజిటివ్‌ వచ్చినవారు ఇప్పుడు జిల్లాలో ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నా రు. వీరంతా చిన్న చిన్న చిట్కాలు పాటించి రోజువారీగా వ్యాయామం చేయడంతో పాటు సి విటమి న్‌ ఉన్న అల్పాహారంతో పాటు భోజనం తీసుకుంటే వ్యాధి నుంచి బయట పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు హోం క్వారంటైన్‌ వారు తీ సుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసింది. కరోనా పాజిటివ్‌ వచ్చినవారు హోం క్వారంటైన్‌లో ఉంటేఉదయం 6 గం టలకే నిద్ర లేవడంతో పాటు 6:30 గంటల నుంచి గంట పాటు యోగా, ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. ఉదయం 7:30 గంటలకు 50-100 మి. లీ. వేడి నిమ్మకాయ నీరు తాగాలి. 7:30 గంటల నుంచి 8 గంటల లోపు విటమిన్‌-సి ఉన్న అల్పా హారం (బ్రేక్‌ఫాస్ట్‌) తీసుకోవాలి. 8:30 గంటలకు 50-100 మి.లీ. వేడి పాలు, పసుపు కలుపుకుని తీ సుకోవాలి. ఉదయం 9 గంటలకు 5-10 నిమిషాలపాటు ఆవిరి పట్టుకోవాలి. 


9:30 గంటలకు 50-100 లీటర్ల వేడి నీటితో ఆయుర్వేద టీ తాగాలి. 11 గం టలకు మరోమారు వేడి టీని తాగాలి. 12 గంటల కు 50-100 మి.లీ. వేడి నిమ్మకాయ నీటిని తాగాలి. మధ్యాహ్నం 1-2 గంటల మధ్యలో విటమిన్‌-సి ఉండే భోజనాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకు 5-10 నిమిషాలపాటు మరోమారు ఆవిరి ప ట్టుకోవాలి. సాయంత్రం 5:30 గంటలకు 50-100 మి.లీ. వేడి నీటితో చేసిన ఆయుర్వేద టీ తాగాలి. 6-7 గంటల వరకు యోగా లేదా వ్యాయామం చే యాలి. 7:30 గంటల నుంచి 8:30 గంటల మధ్య లో విటవిన్‌-సి ఉండేలా భోజనం చేయాలి. రాత్రి 9 గంటలకు 10 నిమిషాల పాటు  ఆవిరి పట్టుకోవా లి. 9:30 గంటలకు వేడి నీటితో చేసిన ఆయుర్వేద టీని మరోసారి తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించేముందు 50-100 మి.లీ. వేడి పాలు మరోమారు పసుపు కలుపుకుని సేవించాలి. ఇలా హోం క్వారంటైన్‌లోనివారు నిబంధనలు పాటిస్తే కరోనాను జయించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-08-03T19:58:22+05:30 IST