మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-12-06T06:51:54+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. నియంత్రణ చర్యలపై దృష్టిసారించింది. కొవిడ్‌ మూడో దశ ముప్పుతోపాటు ‘ఒమె ౖక్రాన్‌’ వ్యాప్తి కలకలంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

జిల్లాలో నాలుగు రోజులుగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

‘ఒమైక్రాన్‌’ వ్యాప్తితో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

వందశాతం టీకాలు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌

ఇంకా మొదటి డోసు వేసుకోని 75 వేల మంది

నిజామాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): జిల్లాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. నియంత్రణ చర్యలపై దృష్టిసారించింది. కొవిడ్‌ మూడో దశ ముప్పుతోపాటు ‘ఒమె ౖక్రాన్‌’ వ్యాప్తి కలకలంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. బస్టాండ్‌లు, రేషన్‌ దుకాణాలు, ఇతర సంస్థల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  ప్రతి ఒక్కరూ మా స్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచిస్తూ మాస్కు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.

ప్రతి రోజూ కేసుల నమోదు..

జిల్లాలో నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రతి రోజూ మూడు నుంచి ఐదు వరకు కేసులు నమోదవుతున్నా యి. విద్యార్థులు, ఉద్యోగుల్లో కేసులు బయటపడుతుండటంతో యంత్రాం గం అప్రమత్తమయింది. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ పరిధిలో టెస్టులను పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్ల ను చేస్తున్నారు. కరోనా కేసులు ఎక్కు వగా వ్యాపించకుండా మాస్కులను తప్పనిసరి చేశారు. మాస్కులు ధరిం చకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి వెయ్యి రూపాయల ఫైన్‌ విధిం చనున్నారు. అన్ని సమావేశాల్లో మా స్కులు తప్పనిసరి వాడాలని, శాని టైజర్లు వినియోగించాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రితో పాటు అన్ని పీహెచ్‌సీలలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేస్తు న్నారు. ఆక్సిజన్‌, రెమ్‌డెసివీర్‌ ఇంజక్షన్లు, చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు.

ఇంటింటి సర్వే ద్వారా అర్హుల గుర్తింపు..

జిల్లాలో వ్యాక్సిన్‌కు అర్హత ఉన్నవారు 11లక్షల50 వేల వరకు ఉన్నట్లు ఇంటింటి సర్వే ద్వారా గుర్తిం చారు. వీరిలో 95 వేలకు పైగా విదేశాలకు వెళ్లగా మిగతా వారు 10లక్షల55 వేలు ఉన్నారు. వీరిలో మొదటి డోసు ఇప్పటి వరకు 9లక్షల50 వేల మందికి పైగా వేశారు. ఇంకా మొదటి డోసు వేసుకొని వారు75 వేల వరకు ఉన్నారు. వీరితో పాటు 4లక్షల మందికి రెండో డోసు వేశారు. జిల్లాలో వందశాతం అందరికి వ్యాక్సిన్‌ వేయాలని యంత్రాంగం నిర్ణయించింది. వ్యాక్సిన్‌ వేసుకొని వారు నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోఽధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో వాటి పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. జిల్లాలో రేషన్‌ బియ్యం పదిహేను రోజుల పాటు ఇవ్వనుండడంతో వాటి వద్ద ప్రత్యేక బృందాలను నియమించారు. బియ్యం కోసం వచ్చే వారిలో వ్యాక్సిన్‌ తీసుకొని వారిని గుర్తించి వేస్తున్నారు. గ్రామాల్లో స్థానిక సర్పంచ్‌, వార్డు మెంబర్లు ఇతరుల సహయంతో వ్యాక్సిన్‌ తీసుకొని వారిని గుర్తిస్తున్నారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, హోటల్స్‌, ఇతర ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఈ నెల చివరివరకు అర్హులైన వారందరికీ రెండో డోసు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

ప్రత్యేక డ్రైవ్‌..

జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వందశాతం వ్యాక్సినేషన్‌ వేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామని డాక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. జిల్లాలో మొదటి డోసు 96 శాతానికి పైగా పూర్తయ్యిందని, మిగతా వారిని గుర్తించి వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. రెండో డోసు నాలుగు లక్షల మందికి పైగా పూర్తయిందన్నారు. మిగతా వారికి  నెలాఖరులోపు పూర్తిచేస్తామన్నారు.

Updated Date - 2021-12-06T06:51:54+05:30 IST