కరోనా ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2020-06-29T11:33:37+05:30 IST

కరోనా వైరస్‌ విస్తృతి ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోంది. ఏలూరును మరింతగా కమ్మే స్తోంది.

కరోనా ఎక్స్‌ప్రెస్‌

ఒక్కరోజే 128 మందికి పాజిటివ్‌

మొత్తం కేసుల సంఖ్య 1324


ఏలూరు, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విస్తృతి ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోంది. ఏలూరును మరింతగా కమ్మే స్తోంది. నగరంలో 500 మైలురాయిని దాటి.. మరిన్ని కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వన్‌టౌన్‌ ప్రాంతాన్ని సంపూర్ణంగా మూసివేసి లాక్‌డౌన్‌ ప్రకటించగా.. తాజాగా టూ టౌన్‌ ప్రాంతంలోనూ కేసులు పెరిగాయి. నగర పరిధిలోని ఒక్క సుబ్బులవారి వీధిలోనే ఇరవైకిపైగా కేసులను నిర్ధారించారు. ఎన్టీఆర్‌ కాలనీ, న్యూజేపీ కాలనీ, వైఎస్సార్‌ కాలనీ, ఎరుకల కాలనీ, బావిశెట్టివారిపేట, సత్య నారాయణపేట, గాడివారివీధి, పెద్దింటివారివీధి, మారుతీ నగర్‌, తూర్పులాకులు, కందివారివీధి, ఎడ్లవారివీధి, చేపల తూము, ఆర్‌ఆర్‌ పేట, దాసరి యర్రయ్యవీధి, పూడివారి వీధి, పోలిశెట్టివారి వీధి, ఫిలాస్‌పేటలతోపాటు, రూరల్‌ ప్రాంతంలోని శ్రీపర్రు, పాలగూడెం, కొమడవోలు వీవీ నగర్‌, మాదేపల్లి, లింగారావుగూడెం ప్రాంతాల్లో కలిపి ఆదివారమే 81 కేసులు నమోదయ్యాయి.


జిల్లావ్యాప్తంగా మరో 47 కేసు లను గుర్తించారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం, పర్సావారివీధి, ధర్బరేవు ప్రాంతాల్లో 14, పట్టణంలో మూడు కేసులు గుర్తించారు. భీమవరంలోని నర్సింహపురం, 14, 23, 29 వార్డుల్లో తొమ్మిది, పాలకొల్లులో 8, అత్తిలి మండలం ఓడూరు, రమణయ్యపేటల్లో రెండు, ద్వారకా తిరుమల, చాగల్లు, దేవరపల్లి మండలం దుద్దుకూరు, పెదవేగి మండ లం భోగాపురం, కొవ్వూరు మండలం ఔరంగాబాదు, ఉంగు టూరు మండలం చినవెలమిల్లితోపాటు లిఖితపూడి, యాగ ర్లపల్లి, తాడేపల్లిగూడెం బొండారివారి వీధి, దెందులూరు సినిమా హాల్‌ వద్ద, ఉండి మండలం పాందువ్వ కండ్రికలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. పది రోజులుగా పాజిటి వ్‌ల సంఖ్య దూకుడుగానే ఉంది.


కొత్త ప్రాంతాలకు విస్త రించడంతోపాటు గతంలో నమోదైన ప్రాంతాల్లోనూ అదనం గా వచ్చి పడుతున్నాయి. ఈ తరహా విస్తృతి మరికొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్‌ పరీక్షలు విస్తృతం చేసి అనుమానితులు ఎవరైనా ఉంటే ఫలితా లను రాబడుతున్నారు. ఈ కారణంగానే ఏ రోజుకారోజు బయట పడుతున్న కేసుల సంఖ్య అనూహ్యంగా ఉంది. విజయవాడ కొవిడ్‌ ప్రధానాసుపత్రిలో జిల్లాకు చెందిన మరొకరు వైరస్‌తో కన్నుమూశారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 1324కి చేరడం మ రింత దిగ్ర్భాంతి కలిగిస్తోంది. ఇప్పటికే పాజిటివ్‌ బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దాదాపు ముఖ్య శాఖలన్నింటిలోనూ కొందరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మూడు రోజుల నుంచి ఏడుగురు ఉపాధ్యాయు లకు పాజిటివ్‌ సోకినట్లు గుర్తించారు. 

Updated Date - 2020-06-29T11:33:37+05:30 IST