ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-21T07:10:10+05:30 IST

కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది.

ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా

(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌)

కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నల్లగొండ మండలం, ఆర్బన్‌లోని మూడు కేంద్రాల్లో మంగళవారం 479 యాంటీ ర్యాపిడ్‌ టెస్టులు చేయగా అందులో 168 పాజీటీవ్‌ నమోదు అయ్యాయి. రా ములబండ పీహెచ్‌సీ పరిధిలో మూడు గ్రామాల్లో 75మందికి టెస్టు లు చేయగా 27మందికి పాజిటివ్‌గా నమోదు అయింది. పట్టణ పరిధిలోని లైన్‌వాడ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 125మందికి టెస్టులు చేయ గా, 46 మందికి పాజిటివ్‌ నమోదు అయింది. యూపీఎస్‌ మాన్యం చెల్క హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 145 మందికి టెస్టులు చేయ గా 39 మందికి పాజీటీవ్‌ నమోదు అయింది. యూపీఎస్‌ పానగల్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 134 మందికి టెస్టులు చేయగా, 56 మందికి పాజిటివ్‌ నమోదు అయింది. మొత్తం నల్లగొండ నియోజ కవర్గ వ్యాప్తంగా 183పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా కనగల్‌ ఎస్‌ఐ సతీష్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా ఎస్‌ఐ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. 

కాగా దేవరకొండ నియోజకవర్గ వ్యా ప్తంగా 140 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మిర్యాలగూ పట్టణం లో 64 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మిర్యాలగూడ రూరల్‌ సెంటర్లో 25కేసులు నమోదయ్యాయి. నియోజ కర్గ వ్యాప్తంగా మొత్తం కలిపి 124కేసులు నమోదయ్యాయి. నాగార్జునసాగర్‌ నియో జకర్గ వ్యాప్తంగా 246కొవిడ్‌ పాజిటివ్‌లు భారీగా నమోదయ్యాయి. తిరిమలగిరిలో 58, నాగార్జునసాగర్‌లో 49, పెద్దవూరలో 44, హాలి యాలో 38, త్రిపురారంలో 19, గుర్రంపోడులో 23కేసులు నమోయ్యా యి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 80పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నకిరేకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 79పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Updated Date - 2021-04-21T07:10:10+05:30 IST