పాఠశాలలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-12-04T07:04:15+05:30 IST

జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పూలాంగ్‌) ఉర్దూ మీడియం పాఠశాలలో కరోనా కలకలం రేపింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో 18 నెలల పాటు మూసిఉన్న విద్యాసంస్థలు తిరిగి సెప్టెంబరు 1న ప్రారంభంకాగా జిల్లాలో ఇప్పటి వరకు విద్యాసంస్థల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదుకాలేదు.

పాఠశాలలో కరోనా కలకలం

ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌ వచ్చిన మరునాడే విద్యార్థినికి..

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 3: జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పూలాంగ్‌) ఉర్దూ మీడియం పాఠశాలలో కరోనా కలకలం రేపింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో 18 నెలల పాటు మూసిఉన్న విద్యాసంస్థలు తిరిగి సెప్టెంబరు 1న ప్రారంభంకాగా జిల్లాలో ఇప్పటి వరకు విద్యాసంస్థల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదుకాలేదు. అయితే ‘ఒమైక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో జిల్లా కేంద్రంలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉపాధ్యాయురాలికి గురువారం కరోనా నిర్ధారణ కాగా శుక్రవారం 4వ తరగతి చదువుతున్న వసతి గృహ విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఆ పాఠశాలతో పాటు పక్కనే ఉన్న బీసీ బాలికల వసతిగృహం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థినిని ఐసొలేషన్‌లో ఉంచారు. పాఠశాల, వసతిగృహంలో ఉంటున్న 152 మంది విద్యార్థులకు సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఎవరికి పాజిటివ్‌గా తేలకపోవడంతో వసతిగృహ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

అప్రమత్తమైన  అధికారులు..

కరోనా రెండో దశ అనంతరం గత నెలలో పూర్తిస్థాయిలో జిల్లాలో విద్యాసంస్థలు ప్రారంభంకాగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాలేదు. ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలైతే విద్యార్థులకు టెంపరేచర్‌ చెక్‌చేసిన తర్వాతనే పాఠశాలల లోపలికి అనుమతిస్తున్నారు. నిత్యం శానిటేషన్‌ చేస్తున్నారు. జిల్లాలో విద్యాసంస్థల్లో కరోనా తొలికేసు నమోదుకావడంతో విద్యాశాఖ అధికారులతో పాటు వసతి గృహ అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన వి ద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలు పా టించాలని హెచ్చరికలు జారీచేశారు. పాఠశాలలో శానిటైజేషన్‌తో పాటు శానిటైజర్‌, మాస్కులు ధరించాలని ఆదేశించారు.

Updated Date - 2021-12-04T07:04:15+05:30 IST