గుండెపై దాడి చేస్తున్న కరోనా మహమ్మారి

ABN , First Publish Date - 2020-10-28T09:25:04+05:30 IST

కరోనా వైరస్‌ రోగుల గుండెపై దాడి చేసి, అందులోని సున్నితమైన భాగాలకు గాయాలు చేసి, వాటి పనితీరుకు భంగం కలిగిస్తోందని

గుండెపై దాడి చేస్తున్న కరోనా మహమ్మారి

న్యూయార్క్‌, అక్టోబరు 27: కరోనా వైరస్‌ రోగుల గుండెపై దాడి చేసి, అందులోని సున్నితమైన భాగాలకు గాయాలు చేసి, వాటి పనితీరుకు భంగం కలిగిస్తోందని అమెరికాలోని మౌంట్‌ సినాయ్‌ ఆస్పత్రి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, గుండెపోటు సంభవించి మృత్యువాత పడుతున్నారని గుర్తించారు. మొత్తం 305 మంది రోగుల ఆరోగ్య స్థితిగతులను అధ్యయనం చేయగా.. వారిలో 190 మంది గుండెపై కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ ప్రభావం పడినట్లు తేలింది. వైరస్‌ ప్రభావంతో గుండెలోని కుడి జఠరిక గది పనితీరు మందగించడం, ఎడమ జఠరికలోని గోడ భాగం కదలికలు గతి తప్పడం వంటి లక్షణాలను రోగుల్లో గుర్తించారు.   

Updated Date - 2020-10-28T09:25:04+05:30 IST