టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు కరోనా ఎఫెక్ట్!

ABN , First Publish Date - 2021-04-05T00:14:30+05:30 IST

టీఆర్ఎస్ ప్లీనరీపై మరోమారు కరోనా ఎఫెక్ట్ పడింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా ప్లీనరీని వాయిదా వేయాలని టీఆర్ఎస్

టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు కరోనా ఎఫెక్ట్!

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీపై మరోమారు కరోనా ఎఫెక్ట్ పడింది. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్లీనరీని వాయిదా వేయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. వరుసగా మూడో ఏడాది కూడా ఆవిర్భావ వేడుకలు రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా అధిష్టానం ప్లీనరీ నిర్వహించలేదు. 2020లో కరోనా కారణంగా వేడుకలు రద్దు చేశారు. ఈ ఏడాది ద్విశతాబ్ధి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధిష్టానం భావించింది. మళ్లీ కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సమీక్షలో ప్లీనరీపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు.  

Updated Date - 2021-04-05T00:14:30+05:30 IST