కళ్లుగప్పి తెలంగాణ నుంచి ఏపీకి

ABN , First Publish Date - 2020-03-31T09:23:23+05:30 IST

క్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ నుంచి 30 మంది అధికారుల కళ్లుగప్పి ఏపీలోని స్వగ్రామాలకు చేరుకోవడం కడప జిల్లా రాజంపేటలో తీవ్ర కలకలం రేపింది. కరోనా కారణంగా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడడంతో నాలుగు రోజుల క్రితం

కళ్లుగప్పి తెలంగాణ నుంచి ఏపీకి

రాజంపేట, మార్చి 30: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ నుంచి 30 మంది అధికారుల కళ్లుగప్పి ఏపీలోని స్వగ్రామాలకు చేరుకోవడం కడప జిల్లా రాజంపేటలో తీవ్ర కలకలం రేపింది. కరోనా కారణంగా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడడంతో నాలుగు రోజుల క్రితం వారు మోటారు సైకిళ్లు, ఇతర వాహనాల ద్వారా అధికారుల కళ్లుగప్పి స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే వారంతా ఐసోలేషన్‌లో లేకుండా బయట తిరుగుతుండడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. నందలూరు మండల వైద్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, సీహెచ్‌వో పిల్లి పిచ్చయ్య ఆధ్వర్యంలో వైద్యబృందం ఆ గ్రామానికి వెళ్లింది. తమను ఐసోలేషన్‌కు తరలిస్తారన్న భయంతో వారంతా పొలాల్లో దాక్కున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని..తెలంగాణ నుంచి వచ్చిన వారందర్నీ పిలిపించి 14 రోజులు తప్పనిసరిగా గృహ నిర్బంధంలో ఉండాల్సిందేనని లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పుల్లంపేట మండలానికి చెందిన ఓ మహిళ ఈ నెల 18న సింగపూర్‌ నుంచి స్వగ్రామానికి వచ్చింది. అదే విమానంలో ప్రయాణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ తేలడంతో పుల్లంపేట మహిళను అధికారులు సోమవారం కడప రిమ్స్‌కు తరలించారు.

Updated Date - 2020-03-31T09:23:23+05:30 IST