శ్రీశైలం దేవస్ధానంపై కరోనా ఎఫెక్ట్.. తాత్కాలికంగా దర్శనాలు రద్దు

ABN , First Publish Date - 2020-07-14T23:16:10+05:30 IST

శ్రీశైలం దేవస్ధానంపై కరోనా ఎఫెక్ట్.. తాత్కాలికంగా దర్శనాలు రద్దు

శ్రీశైలం దేవస్ధానంపై కరోనా ఎఫెక్ట్.. తాత్కాలికంగా దర్శనాలు రద్దు

కర్నూలు: శ్రీశైలం దేవస్థానంపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా ప్రభావంతో ఉద్యోగులు, అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో కొంత మంది ఉద్యోగులు, పరిచారకులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆలయంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో భక్తులు లేకుండా యధావిధిగా నిత్యకైంకర్యాలు పూజలు, పరోక్ష సేవలను కొనసాగిస్తామని ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు. శ్రీశైలంలో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారం రోజులపాటు శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల్లో దేవాదాయశాఖ అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. 

Updated Date - 2020-07-14T23:16:10+05:30 IST