సాదాసీదాగా సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2020-04-03T09:04:17+05:30 IST

ఉట్నూర్‌లో గురువారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్స వం సాదాసీదాగా సాగింది. కాకతీయుల యేలుబడిలో స్థానికంగా నిర్మించిన సీతా రాముల పురాతన ఆలయంలో

సాదాసీదాగా సీతారాముల కల్యాణం

ఉట్నూర్‌, ఏప్రిల్‌2: ఉట్నూర్‌లో గురువారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్స వం సాదాసీదాగా సాగింది. కాకతీయుల యేలుబడిలో స్థానికంగా నిర్మించిన సీతా రాముల పురాతన ఆలయంలో పూజారి సంతోష్‌ దూబే ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారులు పార్నంది శివకుమార్‌, పాత గౌరిశంకర్‌, పాత రవీందర్‌ నేతృత్వంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. హాజరైన కొంతమంది భక్తులు సైతం సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కల్యా ణాన్ని వీక్షించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ దంపతులు సీతారాముల కల్యాణంలో భాగస్వాములయ్యారు. ఈసారి కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా సీతా రాముల కల్యాణ మహోత్సవ కళ తప్పింది. ఆలయం వద్ద భారీ సంఖ్యలో భక్తులు తరలి రాకుండా ఉండడానికి సీఐ నరేష్‌ కుమార్‌ పర్యవేక్షణలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు నిర్వహించారు. కార్యక్రమంలో గడ్డం ప్రకాష్‌, కోండేరి రమేష్‌, సట్ల అశోక్‌, చింతల భీమన్న, ఠాకూర్‌ గోపాల్‌సింగ్‌, శ్యాంసుందర్‌, సాడిగే రాజ్‌గోపాల్‌,  పోచన్న షావుకారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-03T09:04:17+05:30 IST