రిజిస్ట్రేషన్లపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-05-08T05:10:34+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ రిజిస్ట్రేషన్‌శాఖపై పడింది. గత ఏడాది కొత్తగా ధరణి ద్వారా రిజి స్ట్రేషన్ల విధానం తీసుకురాగా దాదాపు మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ర్ట్ఱేషన్లు నిలిచిపోయాయి.

రిజిస్ట్రేషన్లపై కరోనా ఎఫెక్ట్‌

 రోజుకు 50 డాక్యుమెంట్లకే అనుమతి

 ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్‌లో రూ. 14.14 కోట్ల ఆదాయం


కరీంనగర్‌ క్రైం, మే 2: కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ రిజిస్ట్రేషన్‌శాఖపై పడింది. గత ఏడాది కొత్తగా ధరణి ద్వారా రిజి స్ట్రేషన్ల విధానం తీసుకురాగా దాదాపు మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ర్ట్ఱేషన్లు నిలిచిపోయాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేన్ల శాఖ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ప్రస్తుతం ఆ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు, డాక్యుమెంట్‌ రైటర్లు, ఇతర సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జాగ్రత్త చర్య లు చేపట్టారు. కరోనా ఉధృతంగా ఉండడం, ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఉండబోదని తేల్చి చెప్పటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్ర త్త చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా కరీంనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రద్దీ తగ్గించేందుకు రోజుకు 50 డాక్యు మెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వారం రోజుల నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కరీంనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాల యంలో రోజుకు 100కుపైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ఇప్పుడు 50కి కుదించారు. ఇంకో వైపు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయ విక్రయదారుల సంఖ్య  కరోనా కారణంగా ఇటీవల తగ్గిపోయింది. అత్యవసరం ఉన్న బ్యాంక్‌ రుణాలు, మార్ట్‌గేజ్‌, సంస్థలు, రిలీజ్‌ డాక్యుమెంట్‌, జీపీఏల వంటి డాక్యు మెంట్‌ల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. 


డాక్యుమెంట్‌ రైటర్ల సెల్ఫ్‌ లాక్‌డౌన్‌


కరీంనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లు శనివారం నుంచి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ వరకు 15 రోజుల పాటు ఎలాంటి డాక్యు మెంట్‌లు తయారు చేయవద్దని డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్‌ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు కూడా సమాచారాన్ని అందించింది. శనివారం నుంచి కరీంనగర్‌లోని డాక్యుమెంట్‌ రైటర్లు వారి కార్యాలయాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు కూడా డాక్యుమెంట్‌ లను తయారు చేయవద్దని, అత్యవసరమున్న సందర్భంలో క్రయవిక్రయదారులే డాక్యు మెంట్‌లను తయారు చేసుకుంటారని అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. 


ఏప్రిల్‌లో కార్యాలయాల వారీగా ఆదాయం

ఉమ్మడి జిల్లాలో 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏప్రిల్‌లో 7,096 ఆస్తుల రిజిస్ట్రేష న్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా 14 కోట్ల 14 లక్ష 44 వేల రూపాయలు ఆదాయం సమకూరింది. ఇందులో స్టాంపుడ్యూటీ రూపంలో 9.71 కోట్లు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 2.94 కోట్లు, రిజిస్ట్రేషన్‌ ఫీజు 1.50 కోట్ల ఆదాయం వచ్చింది. 


కార్యాలయం రిజిస్ట్రేషన్ల సంఖ్య  ఆదాయం (రూ. కోట్లలో)

 ----------------------------------------------------------- 

కరీంనగర్‌                     1187              3,47,72,000        

కరీంనగర్‌ రూరల్‌           523              76,18,000         

గంగాధర                      769              1,41,95,000

హుజురాబాద్‌                 453                98,05,000

జగిత్యాల                      586                1,26,05,000 

మల్యాల                       125                31,52,000

మంథని                       212                21,60,000

మెట్‌పల్లి                      201                30,51,000

పెద్దపల్లి                       1140              2,98,91,000 

సిరిసిల్ల                        865                90,38,000           

సుల్తానాబాద్‌                134                33,44,000

వేములవాడ                  521                61,17,000

కోరుట్ల                         380                56,96,000

మొత్తం                        7096              14,14,44,000

Updated Date - 2021-05-08T05:10:34+05:30 IST