Abn logo
Aug 8 2020 @ 14:30PM

కాటెయ్యకే..కరోనా.. నిర్ధారణ పరీక్షల కోసం పరుగులు

Kaakateeya

అనుమానితులతో రిమ్స్‌ కిటకిట 

వేధిస్తున్న కిట్‌ల కొరత 

హోంక్వారంటైన్‌పై వైద్యసిబ్బంది శీతకన్ను


ఒంగోలు: జిల్లాలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచి న రెండు, మూడు రోజులుగా జ్వరపీడితులు అధికమ వుతున్నారు. వళ్ళునొప్పులు, జలుబు, జ్వరం, తలనొప్పు లతో బాధపడేవారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. దీ ంతో తమకు కరోనా సోకిందేమోనన్న కలవర పడు తూ నిర్ధారణ పరీక్షల కోసం ఒంగోలు రిమ్స్‌ క్యూ కడు తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంజీవని మొబైల్‌ పరీక్ష కేంద్రం ద్వారా జిల్లా అంతట నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా అనుమా నితులు బారులు తీరుతున్నారు. అదేవిధంగా పీహెచ్‌ సీల్లోనూ తాకిడి అధికమైంది. ఒంగోలులో గత సోమ వారం నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం విచ్చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. కొద్దిపాటి జ్వర పీడి తులు అనుమానంతో ఆందోళన చెందుతుండగా, మరి కొంతమంది ముందస్తుగా పరీక్షలు చేసుకుంటే మంచి దన్న ఆలోచనతో పరీక్షల కోసం పరుగులు పెడుతు న్నారు. దీంతో రిమ్స్‌ ఆసుపత్రిలోని ఓపీ విభాగం ప్రతి రోజూ కిటకిటలాడుతోంది. 


కిట్‌ల కొరత 

జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్‌ల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు 700 నుంచి 1000 మంది వరకు ర్యాపిడ్‌ కి ట్స్‌, ట్రూనాట్‌, వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా, అందులో సగం మందికి పాజిటివ్‌గా రావడంతో బాధి తులు పెరిగిపోతున్నారు. అయితే వైద్యులు, వైద్యసి బ్బంది కొరత కూడా తీవ్రంగా ఉండటం సేవలు పూర్తి స్థాయిలో లభించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉ న్న వైద్యులు గత మూడు నెలలుగా నిర్విరామంగా క రోనా వైద్యసేవల్లో నిమగ్నమై ఉన్నారు. 


వెంటిలేటర్ల సమస్య

ఇటీవల కాలంలో కొందరు కరోనా బాధితులకు శ్వా సకోశ ఇబ్బందులు ఎదురవడంతో వెంటిలేటర్ల సమస్య కూడా ఎదురయింది. దీంతో వైరస్‌ బారిన పడిన వా రు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న పాజిటివ్‌ బాధితులు పూర్తిగా కోలుకునేందుకు వెంటిలేటర్లు, బె డ్‌ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్ర భుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.


ఫలితాలు వెల్లడిలో తీవ్ర జాప్యం 

కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ర్యాపిడ్‌ కిట్‌లతో నిర్వహించే ప రీక్షలకు పది నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడి అవుతుం డగా సరిపడా కిట్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఇక ట్రూనాట్‌, వీఆర్‌డీఎల్‌ పరీక్షల ఫలితాలు వాస్తవా నికి రెండు రోజుల్లో రావాల్సి ఉండగా, ప్రస్తుతం పె రుగుతున్న అనుమానితులతో పదిహేను రోజుల వర కు కూడా ఏమిటన్నది తెలియని పరిస్థితి నెలకొంది. దీనివల్ల కొందరికి పాజిటివ్‌, మరికొందరికి నెగిటివ్‌ వచ్చింది. కానీ ఫలితాల్లో జాప్యం వల్ల కరోనా బాధి తులను తమ పనుల్లో భాగంగా కలిసిన వారందరూ కలవరపాటుకు గురవతున్నారు. 


హోంక్వారంటైన్‌పై నిర్లక్ష్యం

కరోనా పాజిటివ్‌తో హోంక్వారంటైన్‌లో ఉన్న వారి పరిస్థితీ దారుణంగా ఉంటోంది. కనీసం పక్కింటి వా రు కూడా పలకరించడం మానేస్తున్నారు. ఇంటి సభ్యు లు కూడా కలిసిమెలిసి గడపలేని దుస్థితి నెలకొంది. అంతేగాకుండా వైద్యసిబ్బంది కూడా వారి ఆరోగ్యం ప ట్ల నిర్లక్ష్యం చేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. అలాగే కరోనాతో ఐసోలేషన్‌లో ఉండి, కోలుకుని ఇంటికొచ్చిన తర్వాత ఆరోగ్యస్థితి గతులు అడిగిన వారే కరువయ్యారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.  అంతేగాకుండా వైద్యసిబ్బంది కూడా ఎప్ప టిక ప్పుడు పట్టించుకోవాలనే నిబంధనలు ఉన్నా.. అవి అ మలు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement