అనంతపురం: పండ్ల తోటలకు కరోనా ఎఫెక్ట్

ABN , First Publish Date - 2020-04-01T17:34:04+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనంతపురం జిల్లాలో పండ్ల తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

అనంతపురం: పండ్ల తోటలకు కరోనా ఎఫెక్ట్

అనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనంతపురం జిల్లాలో పండ్ల తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన అరటిపంటను కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసే అవకాశం లేదు. దీంతో జిల్లాలో అరటి పంట సాగుచేస్తున్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే అరటి పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతులు వాపోతున్నారు.


ఈ సందర్భంగా కొండయ్య అనే అరటితోట రైతు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఆరెకరాల్లో అరటి సాగు చేసినట్లు చెప్పాడు. దీనికి పెట్టుబడి రూ. 12 లక్షలయిందని చెప్పాడు. దిగుబడి చాలా బాగా వచ్చిందని రైతు సంతోషం వ్యక్తం చేశాడు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా పంటను అమ్ములేక, అప్పులు తీర్చే మార్గం లేక ఆందోళన చెందుతున్నామని అన్నాడు. దీనిపై ప్రధాని మోదీకి మెసేజ్ పెట్టామని, స్పందన రాలేదని అన్నాడు. ఇలాగే మరో 10 రోజులు ఉంటే పంట మొత్తం నాశనమైపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 

Updated Date - 2020-04-01T17:34:04+05:30 IST