కరోనాతో రుచి మొగ్గలకు ముప్పు లేదు

ABN , First Publish Date - 2020-08-08T06:59:04+05:30 IST

రుచిని గుర్తించలేకపోవడం కూడా కరోనా లక్షణమే అంటూ జరిగిన ప్రచారం సరికాదని అమెరికాలోని జార్జియా వర్సిటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కొవిడ్‌-19 వైరస్‌ మనిషి శరీర కణాల్లోకి చొరబడేందుకు కణజాలం ఉపరితలంపై...

కరోనాతో రుచి మొగ్గలకు ముప్పు లేదు

వాషింగ్టన్‌, ఆగస్టు 7: రుచిని గుర్తించలేకపోవడం కూడా కరోనా లక్షణమే అంటూ జరిగిన ప్రచారం సరికాదని అమెరికాలోని జార్జియా వర్సిటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కొవిడ్‌-19 వైరస్‌ మనిషి శరీర కణాల్లోకి చొరబడేందుకు కణజాలం ఉపరితలంపై ఉండే ఏసీఈ2  ప్రొటీన్‌ను మాధ్యమంగా వాడుకుంటుందన్నారు. నాలుకలో ఉండే రుచి మొగ్గల్లోని(టేస్ట్‌ బడ్స్‌) కణాలపై ఏసీఈ2 ప్రొటీనే లేనప్పుడు.. వాటిపై వైరస్‌ దాడిచేసి, రుచిని గుర్తించే శక్తిని నశింపజేయడం అసాధ్యమని పేర్కొన్నారు. ఎలుకలపై జరిపిన అధ్యయనంలో నాలుకలోని రుచ్చి మొగ్గల కణా ల్లో ఏసీఈ2 ప్రొటీన్‌ జాడ లేదని వెల్లడైందన్నారు.  


Updated Date - 2020-08-08T06:59:04+05:30 IST