కరోనా మరణాలు దాచేస్తున్నారు

ABN , First Publish Date - 2021-04-16T05:08:35+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌తో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం రోజుకు ఒక్క మరణాన్ని మాత్రమే ప్రకటిస్తోంది.

కరోనా మరణాలు దాచేస్తున్నారు

 గుంటూరు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌తో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం రోజుకు ఒక్క మరణాన్ని మాత్రమే ప్రకటిస్తోంది. గత వారం, పది రోజుల్లో కరోనాతో చనిపోయిన వారి పార్ధివ దేహాలను ఖననం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు అంత్యక్రియలు నిర్వహించిన ఘటనలు పాతికకు పైగానే ఉన్నాయి. ఇలా మరణాలు దాచేయడం వలన కూడా ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోంది.  జిల్లాలో కరోన రెండో విడత దాడి తీవ్రంగా ఉంటోంది. గత కొద్ది రోజుల నుంచి మృతుల సంఖ్య పెరుగుతోన్నది. కోవిడ్‌ సోకిన వారు హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడుస్తున్నారు. మృతుల్లో ఎక్కువగా 50 ఏళ్ల వయస్సు దాటిన వారే ఉంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు జిల్లాలో మరణించిన వారి సంఖ్యని ప్రభుత్వం 688గా పేర్కొంటోంది. అయితే అనధికారికంగా ఈ సంఖ్య మరో రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటుందన్న విషయం బహిరంగ రహస్యమే.  

Updated Date - 2021-04-16T05:08:35+05:30 IST