కరోనా మరణాలు నివారించాలి

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

కోవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించి కరోనా మరణాలను నివారించాలని

కరోనా మరణాలు నివారించాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌


ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 6 : కోవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు  మెరుగైన వైద్యసేవలు అందించి కరోనా మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ వైద్యాధికారులను ఆదేశించారు.  ప్రొద్దుటూరు జిల్లాఆస్పత్రిలోని కోవిడ్‌ ఆస్పత్రిని గురువారం డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా ప్రస్తుతం ఎంత మంది కరోనా బాధితులు ఉన్నారు, వారికెలాంటి వైద్యసేవలు అందిస్తున్నారు, అక్సిజన్‌, వెంటిలెటర్‌ వసతుల గురించి వైద్యు లను అడిగి తెలుసుకున్నారు. ప్రొద్దుటూరు జిల్లాఆస్పత్రిలోనే కాకుండా సీబీఐటీ కళాశాలలోను కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని, అదే విధంగా పలు ప్రైవేట్‌ ఆస్పత్రులో కరోనాకు వైద్యం అందుతోందన్నారు.


కరోనాపై ప్రజలు భయం వీడాలని  బాధితులకు వైద్యసేవలు అందేవిధంగా అన్ని సౌకర్యా లు కల్పిస్తున్నామన్నారు. కరోనా బారిన పడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పా టించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ, జిల్లాఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ డెవిడ్‌ సెల్వరాజ్‌, కోవిడ్‌ ఫీల్డ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి, వైద్యాధికారులు ఇలియారాణి, మహాలక్ష్మి, హనీ్‌ఫబాబా, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు, హెచ్‌ఈవోలు రవిశంకర్‌రాజు, రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.


ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా వైద్యంపై ఆరా

పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనా వైద్యం పేరిట అక్కడి వైద్యుడు దోపిడి చేస్తున్నాడంటూ ఆరోపణలు రావడంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అదేశాల మేరకు డీఎంహెచ్‌వో ప్రొద్దుటూరు వచ్చి  ఆస్పత్రిని పరిశీలించి, వైద్యున్ని విచారించారు. కరోనా వైద్యం అందించేందుకు ప్రభుత్వ అనుమతి ఉందా? అని ప్రశ్నించగా అనుమతి లేదని, అయితే తాను అవుట్‌ పెషెంట్‌లను మాత్రమే చూస్తున్నట్లు ఆ వైద్యుడు తెలిపినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రోగులకు ఏఏ మందులు రాసారన్న దానిపై కూడా డీఎంహెచ్‌వో ఆరా తీశారు. విచారణపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST