సర్జరీ రోగుల్లో కరోనా మరణాలు అధికం

ABN , First Publish Date - 2020-06-01T07:43:57+05:30 IST

ఇతరత్రా జబ్బులకు సంబంధించి సర్జరీ చేయించుకున్న కరోనా రోగులకు మరణం ముప్పు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీకి చెందిన ఓ పరిశోధకుల బృందం ప్రపంచవ్యాప్తంగా...

సర్జరీ  రోగుల్లో కరోనా మరణాలు అధికం

  • పరిశోధనలో వెల్లడి

ముంబై, మే 31: ఇతరత్రా జబ్బులకు సంబంధించి సర్జరీ చేయించుకున్న కరోనా రోగులకు మరణం ముప్పు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీకి చెందిన ఓ పరిశోధకుల బృందం ప్రపంచవ్యాప్తంగా 235 ఆస్పత్రుల్లోని 1,128 మంది రోగులకు సంబంధించిన డాటాను అధ్యయనం చేసి ఈ విషయం తేల్చింది. వీరిలో మరణాల రేటు 23.8 శాతంగా ఉందని, ఇది కరోనా ముందు నాటి సాధారణ రోజులతో పోల్చితే చాలా అధికమని తెలిపింది. ఆపరేషన్ల సమయంలో రోగుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దీనికి కరోనా కూడా తోడైతే రోగి మరణించే ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-01T07:43:57+05:30 IST