కరోనాతో మరణిస్తున్న నర్సుల సంఖ్య పెరిగింది: ఐసీఎన్

ABN , First Publish Date - 2020-06-04T04:04:50+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి బలవుతున్న నర్సుల సంఖ్య పెరుగుతోందని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తెలిపింది.

కరోనాతో మరణిస్తున్న నర్సుల సంఖ్య పెరిగింది: ఐసీఎన్

జెనీవా: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి బలవుతున్న నర్సుల సంఖ్య పెరుగుతోందని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తెలిపింది. బుధవారం మీడియాతో మాట్లాడిన ఐసీఎన్ ఉన్నతాధికారి హోవర్డ్ కాటన్ ఈ వివరాలు వెల్లడించారు. మే 6 వరకు కరోనాతో మృతిచెందిన నర్సుల కన్నా.. ఆ తర్వాత మరణించిన నర్సుల సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువని ఆయన చెప్పారు. మే 6న ఈ సంఖ్య 260గా ఉందని, ప్రస్తుతం ఇది 600 దాటిందని హోవర్డ్ వెల్లడించారు. అలాగే ఈ వైరస్ సోకిన వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన సిబ్బంది సంఖ్య 4.5లక్షలపైగా ఉండొచ్చని ఆయన చెప్పారు.

Updated Date - 2020-06-04T04:04:50+05:30 IST