ఆ నలుగురే ఆప్తులైన వేళ!

ABN , First Publish Date - 2021-05-09T04:52:20+05:30 IST

కరోనా రక్కసి ముందు బంధాలు తెగిన వేళ.. నా అన్న వారే అంత్యక్రియలకు ముందుకు రాని సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మానవతను చాటుకున్నారు.

ఆ నలుగురే ఆప్తులైన వేళ!
మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న ఉద్యోగులు

 మానవతను చాటుకున్న ప్రభుత్వ ఉద్యోగులు

 కరోనాతో మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు

ఆత్మకూరు/అనంతసాగరం, మే 8 :  కరోనా రక్కసి ముందు బంధాలు తెగిన వేళ.. నా అన్న వారే అంత్యక్రియలకు ముందుకు రాని సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మానవతను చాటుకున్నారు. కరోనాతో మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి ఆప్తుల య్యారు. ఈ హృదయ విదారకర ఘటన అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో నెలకొంది. గ్రామానికి చెందిన మహిళ(60) కరోనాతో పోరాడుతూ శనివారం మృతిచెందింది. అయితే ఆమె అంతక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ముందుకురాలేదు. దీంతో తామున్నమంటూ వీఆర్‌వో జి.ఉదయభాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి టి.రమణరావు, ఏఎన్‌ఎం నాగమణి, ఆశావర్కర్‌ వరలక్ష్మి మృతదేహాన్ని తరలించి అంతక్రియలు పూర్తిచేశారు. వారికి గ్రామస్థు లు, తోటి ఉద్యోగులు అభినందించారు. 

Updated Date - 2021-05-09T04:52:20+05:30 IST