కరోనా మృతుడి ఉంగరాలు తస్కరించారు

ABN , First Publish Date - 2020-08-08T07:48:15+05:30 IST

కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి దగ్గర నుంచి బంగారం, డబ్బులు ఆసుపత్రి సిబ్బంది తస్కరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

కరోనా మృతుడి ఉంగరాలు తస్కరించారు

బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణ


విశాఖపట్నం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి దగ్గర నుంచి బంగారం, డబ్బులు ఆసుపత్రి సిబ్బంది తస్కరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  కొద్దిరోజుల కిందట అక్కయ్యపాలేనికి చెందిన ఎం.పాండురంగారావు(65) కరోనా వైరస్‌ బారినపడితే అపోలో ఆసుపత్రిలో ఈ నెల మూడున కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే గురువారం ఆయన మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్సకు గాను రూ.1.70 లక్షలకుపైగానే బిల్లు చెల్లిం చామని, మృతదేహాన్ని శుక్రవారం తమకు అందించారన్నారు. మృతదే హాన్ని అప్పగించిన సమయంలో జేబులో ఉండాల్సిన డబ్బులు, చేతి ఉం గరాలు(మూడు తులాల బంగారం) గురించి సిబ్బందిని అడిగితే రూ. 15వేలకు గాను రూ.8 వేలు మాత్రమే ఇచ్చారన్నారు.


ఉంగరాలు గురించి అడిగితే కట్టర్‌ తెచ్చి తీస్తామని మొదట చెప్పారని, తరువాత కనిపిం చడం లేదని, విచారణ చేయిస్తామని ఆసుపత్రి సెక్యూరిటీ అధికారి పేర్కొన్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.వైరస్‌తో చనిపోయిన వ్యక్తులను కుటుంబ సభ్యులు చూడరన్న ఉద్దేశంతో ఇలా చేశారని, కరోనా విపత్కర సమయంలో మృతదేహాల నుంచి వస్తువులు కొట్టేయడం దారుణమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

Updated Date - 2020-08-08T07:48:15+05:30 IST