Abn logo
Mar 30 2020 @ 03:58AM

కరోనా క్రైసిస్‌ ఛారిటీ... కదిలొచ్చిన యువతరం

కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా చిరంజీవి అధ్యక్షతన ప్రారంభమైన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తాయి. ఛారిటీ ఛైర్మన్‌గా చిరంజీవి, సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు ‘సీసీసీ-మనకోసం’ సంస్థకు ఆదివారం యువ హీరోలు తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. రవితేజ రూ.20 లక్షలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ తరఫున ‘దిల్‌’ రాజు, శిరీశ్‌ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. వరుణ్‌ తేజ్‌ రూ.20 లక్షలు, శర్వానంద్‌ రూ.15 లక్షలు, సాయి తేజ్‌ రూ.10 లక్షలు,  విష్వక్‌సేన్‌ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, ‘వెన్నెల’ కిశోర్‌ రూ.2 లక్షలు, లావణ్య త్రిపాఠి రూ.లక్ష విరాళం అందిస్తున్నట్లు వెల్లడించారు. హీరో నిఖిల్‌ కరోనా నియంత్రణకు వివిధ ఆసుపత్రుల్లో పోరాడుతున్న వైద్య సిబ్బందికి ప్రొటెక్షన్‌ కిట్స్‌ అందజేశారు. గాంధీ ఆసుపత్రికి స్వయంగా ఆయనే వెళ్లి 2000 ఎన్‌95 రెస్పిరేటర్లు, 2000 పునర్వినియోగించే గ్లౌజులు, 2000 కంటి అద్దాలు, శానిటైజర్లు, 10వేల మాస్కులు అందజేశారు. యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు సినీ, టీవీ రంగ కార్మికులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను తనకు తెలిసిన 50-60 మందికి అందించనున్నట్లు తెలిపారు. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ పీఎం కేర్స్‌ ఫండ్‌కి రూ.30 లక్షలు విరాళం ప్రకటించారు. కథానాయిక కృతిసనన్‌ తన వంతు సాయం చేస్తానని ట్వీట్‌ చేశారు.                           

 సినిమా డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement