అదే జరిగితే.. ఈ ఏడాదే కరోనాకు అంతం..! డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-01-02T01:04:41+05:30 IST

కరోనా సంక్షోభం అంతమైపోయిందనుకుంటున్న తరుణంలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఒమైక్రాన్! ఈ కొత్త వేరియంట్ వల్ల కలిగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

అదే జరిగితే.. ఈ ఏడాదే కరోనాకు అంతం..!  డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వ్యాఖ్య

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం అంతమైపోయిందనుకుంటున్న తరుణంలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఒమైక్రాన్! ఈ కొత్త వేరియంట్ వల్ల కలిగే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా  కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో అనేక మంది మననుల్లో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్శ.. కరోనాకు అంతమెప్పుడు..! ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఈ ప్రశ్నపై తాజాగా స్పందించారు. కరోనాకు అంతం తప్పదన్న ఆశావాదాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఇందుకు కోసం దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు.


ఇదే జరిగితే 2022లోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. కరోనా టీకాలు పోగేసుకునేందుకు ప్రభుత్వాలు తాపత్రయపడ్డొదని, లేదా..జాతీయవాదం పేరిట ఓ గిరిగీసుకుని అందులోనే ఉండిపోవద్దని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. టీకాల లభ్యతలో వివిధ దేశాల మధ్య నెలకొన్న అసమానతల కారణంగా కరోనా మరింతగా మార్పులు సంతరించుకుని కొత్త వేరియంట్లు ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అసమానతలు తొలగితేనే..కరోనాకు అంతం అంటూ ఒక్క మాటతో తన వైఖరిని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుక సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో టెడ్రోస్ ఈ విషయాలను వెల్లడించారు. 

Updated Date - 2022-01-02T01:04:41+05:30 IST