Abn logo
Apr 20 2021 @ 23:34PM

కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత

 పాలకొండ డీఎస్పీ శ్రావణి

పాలకొండ, ఏప్రిల్‌ 20: కరోనా నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యత అని  డీఎస్పీ శ్రావణి, కమిషనర్‌ ఎన్‌.రామారావు తెలిపారు. మంగళవారం  పాల కొండలోని కోటదుర్గమ్మ జంక్షన్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు పోలీసులు, నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది కవాతు నిర్వహించారు. కవాతులో సీఐ శంకరరావు, పాలకొండ, వీరఘట్టం ఎస్‌ఐలు ప్రసాదరావు, భాస్క రరావు, నగరపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.   ఇచ్ఛాపురం: కరోనా కేసులు పెరుగుతుండడంతో మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తామని సీఐ  ఎం.వినోద్‌బాబు తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురంలోని ప్రధాన జంక్షన్లల్లో సీఐతో పాటు పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ   మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. అనంతరం మాస్కులు అందజేశారు. భామిని: భామిని పీహెచ్‌సీలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌, వైద్య సిబ్బందితో అధికారులు  సమీక్షించారు.  కొవిడ్‌ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై  తహసీల్దార్‌ ఎస్‌. నరసిం హమూర్తి, ఎంపీడీవో పైడితల్లి, వైద్యాధికారులు శరత్‌కుమార్‌, గౌతమీ ప్రియ  అవగాహన కల్పించారు. పాలకొండ: కరోనా నేపథ్యంలో వ్యాపారులు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత షాపులు తెరస్తే చర్యలు తప్పవని  కమిషనర్‌ ఎన్‌.రామారావు హెచ్చరించారు.  పోలీసులు, అధి కారుల ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకే షాపులు  స్వచ్ఛం దంగా మూసివేశారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మార్కెట్‌లో కూరగా యలు, మాంసం విక్రయించాలని కమిషనర్‌ కోరారు.  ఓ మహిళా వ్యాపారి మూడు గంటల తర్వాత షాపు తెరిచి ఉంచడంతో కమిషనర్‌ వెళ్లి చేతులు జోడించి షాపు మూసివేయాలని కోరారు. దీంతో ఆ వ్యాపారి షాపును మూసివేశారు.

కరోనాపై అవగాహన సదస్సు రేపు 

సరుబుజ్జిలి: సరుబుజ్జిలి   జడ్పీ ఉన్నతపాఠశాలలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు,సిబ్బంది, వలంటీర్లకు కరోనాపై గురువారం అవగాహన సదస్సు  నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్‌ ఒకప్రకటనలో తెలిపారు.   కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.

 రణస్థలంలో ఆరు కేసులు..

రణస్థలం:మండలంలో మంగళవారం ఆరు కరోనా కేసులు నమోదైనట్లు  తహసీల్దార్‌ ఎం.సుధారాణి తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జేఆర్‌పురం పంచాయతీలో సర్పంచ్‌ బవిరి రమణ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు.  

 ఆలయ ఉద్యోగి మృతి

గార: మండలంలోని ఓ ఆలయ ఉద్యోగి (57) కరోనాతో మంగళవారం ఉదయం మృతి చెందారు. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన  మ రణించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
Advertisement
Advertisement
Advertisement