కరోనాపై సమరానికి 100 కోట్లు

ABN , First Publish Date - 2020-03-27T06:42:09+05:30 IST

కరోనా నివారణ కోసం మా సంస్థ తరపున రూ. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నాం. కంపెనీ ప్రధాన కేంద్రమైన పుణెలో కొవిడ్‌-19పై ..

కరోనాపై సమరానికి 100 కోట్లు

కరోనా నివారణ కోసం మా సంస్థ తరపున రూ. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నాం. కంపెనీ ప్రధాన కేంద్రమైన పుణెలో కొవిడ్‌-19పై పోరాటానికి అవసరమైన వైద్యపరమైన సదుపాయాల కోసం ఈ నిధిని వెచ్చిస్తాం. ఉపాధి కోల్పోయిన రోజు కూలీలు, నిరాశ్రయులు, వీధి బాలలతో పాటు గ్రామీణాభివృద్ధి, తదితర చర్యలకు నిధి ద్వారా చేయూత అందిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూల అప్‌గ్రెడేషన్‌తో పాటు వెంటిలేటర్లు, ఐసొలేషన్‌ యూనిట్ల ఏర్పాటు కోసం ఈ నిధిని వినియోగిస్తాం.

-రాహుల్‌ బజాజ్‌, బజాజ్‌ గ్రూప్‌ చీఫ్‌

Updated Date - 2020-03-27T06:42:09+05:30 IST