భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని ఇల్లందు మండలంలో కరోనా కలకలం సృష్టించింది. మండలంలోని సీఎస్పీ బస్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకింది. వీరిని చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిని ఎవరెవరు కలిశారు అనే దానిపై విచారణ చేస్తున్నారు.