వెయ్యి దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-15T07:30:37+05:30 IST

జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 1027 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

వెయ్యి దాటిన కరోనా కేసులు

తిరుపతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 1027 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 4020 ఉన్నట్టు ప్రభుత్వ బులెటిన్‌ వెల్లడించింది. కాగా కొత్తగా గుర్తించిన కేసులు.. తిరుపతి నగరంలో 364, చిత్తూరులో 131, తిరుపతి రూరల్‌లో 107, మదనపల్లెలో 62, రేణిగుంటలో 25, పీలేరులో 22, కుప్పంలో 21, చంద్రగిరిలో 20, శ్రీకాళహస్తిలో 17, పూతలపట్టులో 16, పుంగనూరులో 15, పుత్తూరులో 13, జీడీనెల్లూరులో 12, బి.కొత్తకోటలో 10, చిన్నగొట్టిగల్లు, సదుం మండలాల్లో 9 చొప్పున, కురబలకోట, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో 8 వంతున, కేవీపల్లె, నాగలాపురం, నారాయణవనం మండలాల్లో 7 చొప్పున, గుడుపల్లె, పాకాల, పెనుమూరు, రామకుప్పం, సోమల, ఏర్పేడు మండలాల్లో 6 వంతున, పలమనేరు, కలకడ, కలికిరి, తంబళ్లపల్లె, వి.కోట మండలాల్లో 5 చొప్పున, నగరి, పీటీఎం, పెద్దపంజాణి, పిచ్చాటూరు, వాల్మీకిపురం, యాదమరి మండలాల్లో 4 వంతున, ఐరాల, కార్వేటినగరం, ములకలచెరువు, నిమ్మనపల్లె, నిండ్ర, తవణంపల్లె, వడమాలపేట, వరదయ్యపాళెం మండలాల్లో 3 చొప్పున, బైరెడ్డిపల్లి, గుర్రంకొండ, పెద్దమండ్యం, రామచంద్రాపురం, తొట్టంబేడు మండలాల్లో 2 వంతున, బంగారుపాలెం, చౌడేపల్లె, గంగవరం, గుడిపాల, కేవీబీపురం, పాలసముద్రం, రామసముద్రం, శాంతిపురం, వెదురుకుప్పం, ఎర్రావారిపాళెం మండలాల్లో ఒక్కోటి నమోదయ్యాయి. కాగా, నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గాలి భాను ప్రకా్‌షకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తనను కలవడానికి ఎవరూ రావద్దని, తనను కలిసిన వారు కొవిడ్‌ టెస్ట్‌ చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. 


కొవిడ్‌తో ఒకరి మృతి

   బంగారుపాళ్యం మండలంలోని శేషాపురానికి చెందిన ప్రతా్‌పశెట్టి(58) రెండ్రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాస్పత్రికి తరలించగా, కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువ జామున ఆయన మృతి చెందారు. 

Updated Date - 2022-01-15T07:30:37+05:30 IST