తెలంగాణలో ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2020-07-05T23:00:39+05:30 IST

తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో నమోదు అవుతున్న...

తెలంగాణలో ప్రమాద ఘంటికలు

తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో నమోదు అవుతున్న అత్యధిక కేసులు జీహెచ్‌ఎంసీ నుంచే వస్తున్నాయి. హైదరాబాద్‌లో అక్కడక్కడా అని కాదు.. నలుమూలలా కరోనా పంజా విసురుతోంది. దీంతో రోడ్లపై జన సంచారం బాగా తగ్గిపోయింది. 


మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరమంతా దాదాపు సుమారు 25 శాతం నుంచి 30 శాతం వరకూ ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన చాలా మంది రోజు వారి కూలీలు,  ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. గడిచిన వారంగా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 


కరోనా నివారణకు మరోసారి హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారంటూ జూన్ 28న మంత్రి ఈటెల లీక్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ నగరమంతా కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి ఏర్పడింది. సుమారు ఇప్పటివరకూ 25 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రజలు స్వస్థలాలకు వెళ్లినట్లు అంచనా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులు చాలా వరకూ వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాల వారు కూడా స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. మరోవైపు పనులకోసం నిత్యం హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. కనీనం భాగ్యనగరం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా? లేదా? అనే అనిశ్చితి భాగ్యనగర్ వాసుల్లో నెలకొంది. 



Updated Date - 2020-07-05T23:00:39+05:30 IST